ఆ హీరోయిన్ నాకే సొంతం...వేరొకరితో ఊ(స)హించలేను!
బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరు కలిసి నటించిన 'ఏజెంట్ వినోద్' చిత్రం మార్చి 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ...కరీనా నా పక్కన మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఇతరుల పక్కన ఇంత బాగా కనిపించదు అంటూ వ్యాఖ్యానించారు.
గతంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తో కరీనా నటించిన 3ఇడియట్స్, బాడీగార్డ్, రా.వన్ సినిమాలు భారీ విజయం సాధించాయి. ఈ సినిమాల్లో హీరోల పక్కన కరీనా చాలా అందంగా కనిపించింది అంటూ కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి కామెంట్స్ తట్టుకోలేకనే సైప్ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇలా మాట్లాడటం ద్వారా 'కరీనా నాకే సొంతం, వేరొకరితో సహించలేను' అని సైఫ్ పరోక్షంగా సూచించారని బాలీవుడ్ జనాలు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం కరీనా మాధుర్ బండార్ దర్శకత్వంలో 'హీరోయిన్' అనే సినిమాలో కూడా నటిస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అర్జున్ రాంపాల్, రణదీప్ హుడా, షహానా గోస్వామిలు ఈచిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు అమీర్ ఖాన్ తో 'తలాష్', ఇమ్రాన్ ఖాన్ తో కలిసి 'ఏక్ మెయిన్ ఔర్ ఎక్ తు' చిత్రాల్లోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











