షాహిద్ అంటేనే కరీనా కస్సుబుస్సు
సైఫ్ అలీఖాన్ తో కరీనా కపూర్ సుఖంగా ఉండాలని మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ కోరుకుంటుండగా కరీనా కపూర్ మాత్రం వేరే విధంగా మాట్లాడుతోంది. ఆమె మాటల్లోనే...కరీనా, షాహిద్ లను కేవలం ప్రేమికులుగా ఇక గుర్తించవద్దు. మూడేళ్ల క్రితం ఇద్దరం కలిసినపుడు నా కెరీర్ డైవర్ట్ అయింది...ప్రస్తుతం నా కెరీర్ ఉన్నత స్థానంలో ఉంది..అంది కరీనా. గతంలో లాగా ఇక షాహిద్ విషయాలు నన్నేమాత్రం అడగవద్దని కరీనా విలేకరులకు స్పష్టం చేసింది. షాహిద్ తో పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా విలేకరులతో చర్చించిన కరీనా ఇపుడు షాహిద్ అంటేనే కస్సుబుస్సు అంటోంది. సైఫ్ బుట్టలో పడింది కదా. ఇక ఎందుకు భయపడుతుంది.


Click it and Unblock the Notifications











