»   » కరీనా కుమారుడి భారత వ్యతిరేక పేరు వివాదం... ఓమర్ అబ్దుల్లా ఇలా

కరీనా కుమారుడి భారత వ్యతిరేక పేరు వివాదం... ఓమర్ అబ్దుల్లా ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

20,2016 ఉదయం కరీనా, సైఫ్ అలీఖాన్ దంపతులకు ఓ పండంటి మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ దంపతులు వారి కుమారుడికి తైమూర్ అలీ ఖాన్ అని పుట్టిన వెంటనే నామకరణం చేశారు. ఎన్నో రోజుల నుండి కరీనా అభిమానులు గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తోండగా, సైఫ్ తన అఫీషియల్ పేజ్ ద్వారా పండంటి మగ బిడ్డ జన్మించినట్టు తెలిపాడు. గత తొమ్మిది నెలల నుండి ఇటు మీడియా అటు అభిమానులు తమపై చూపించిన ప్రేమకు ఈ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. మేరీ క్రిస్ మరియు న్యూ ఇయర్ విషెస్ ని కూడా అందించారు. ఇక కరీనాకి జన్మించిన బేబి బాయ్ ని చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కరీనా తన బిడ్డతో కలిసి ఉన్న ఓ పిక్ ఒకటి బయటకు వచ్చింది.

Kareena, Saif Ali Khan Have Right To Decide Their Baby's Name : Omar Abdullah

ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుంది. తైమూర్ ని చూసి కరీనా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. సైఫ్ అలీఖాన్‌, కరీనా ఖాన్ ను 2012లో ను వివాహమాడిన విషయం విదితమే.అయితే ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో మంగోళ్ జాతి రాజు తైమూర్‌ 14వ శతాబ్ధంలో భారత దేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో పెను విధ్వంసం సృష్టించాడు. అలాంటి వ్యక్తి పేరు మీ కుమారుడికి ఎలా పెట్టుకుంటారంటూ రెండు రోజులుగా పెద్ద రాద్దాంతం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇటు కరీనా కాని సైఫ్ కాని స్పందించలేదు. ఎన్నికల కమిషన్‌ వద్ద ఉన్న సమాచారం ప్రకారం తైమూరు అనే పేరుతో మొత్తం 5,500 మంది ఉన్నారంట.

అయితే, ఆ పేరు అక్షరాల కూర్పులో మాత్రం భిన్నవిధాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క పశ్చిమబెంగాల్‌ లోనే 3,315మంది తైమూర్‌ అనే పేర్లుగలవాళ్లు ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో 588, బిహార్‌లో 558, మహారాష్ట్రలో 661, జార్ఖండ్‌ లో 282, ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ఒకటి రెండు పేర్లు ఉన్నట్లు ఓట్లర్ల జాబితా ఆధారంగా తెలిసింది. కాని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ జంటకి బాసటగా నిలిచి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. శిశువు యొక్క పేరు నిర్ణయించే అధికారం తల్లిదండ్రులకు ఉంటుంది. అలాంటి విషయంలో పెద్ద పట్టింపులు అవసరం లేదు. తైమూర్ అలీఖాన్ కి హ్యపీ మరియు లాంగ్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ ద్వారా కోరాడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి.

English summary
Former Jammu and Kashmir Chief Minister Omar Abdullah came out in support of the name of the new born and shamed the trollers. He tweeted, "The only people who get to decide a baby's name are the parents of said baby & the ones they ask. Why should opinion of the rest matter?"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu