సూపర్ హిట్టవుతుందనుకున్న కరీనా,సైఫ్ ల లవ్ స్టోరీ యావరేంజ్ రేంజ్ కూడా అయ్యేటట్లు అనిపించటం లేదు. కారణం ఈ మథ్య వారి మథ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. మొదట్లో ఇద్దరూ తాము విపరీతంగా ప్రేమించే వాళ్ళనుంచి విడిపోయి ఒక్కటవటంతో బాగా చనువగా తిరిగేవారు. వాళ్ళ మీద పగ తీర్చుకోవటానకో,ఉక్రోషానికో ఇద్దరూ అతి తక్కువ సమయంలోనే దగ్గరయ్యారు. ఆ గుర్తుగా సైఫ్ తన చేతిపై కరీనా పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకుని తన ప్రేమను నిరూపించుకునే ప్రయత్నం చేసాడు. కాని ఈ అతి ప్రేమే కరీనాను చిరాకుకు గురిచేస్తోందిట. లోకల్ గా ఆమె ఏ షూటింగ్ కి వెళ్ళినా సైఫ్ అక్కడకి పనులన్నీ మానుకుని మరీ ప్రత్యక్షమవుతున్నాడట. ఇక బయిటకు ఒంటిరిగా వెళితే ఫోన్ చేసి సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నాడట. దాంతో సైఫ్ నుంచి కాల్ వస్తే ఎత్తి హలో చెప్పటానకి కరీనా సందేహపడుతోందిట. ఈలోగా కరీనాకి మరో విషయం తెలిసిందిట.అది ఇంతకు ముందు కూడా సైఫ్ తన మాజీ ప్రియురాలిని ఇలానే టార్చర్ పెట్టేవాడని. అనుమానమో అతి ప్రేమో తెలియని అతని ప్రవర్తన చూస్తున్న కరీనా ఎరక్కపోయి ఇరుక్కుపోయనా అని దగ్గర వారి దగ్గర దిగాలుతో చెప్పుకుని భాథపడుతోందిట. ఆలోచనలో పడుతోందట.దాంతో ఈ విషయం సీరియల్ లా ఫాలో అప్ చేస్తున్న బాలీవుడ్ జనం ఆ ముద్దూ..మురిపెం...మూణ్ణాళ్ళ ముచ్చటేనా...అని నవ్వుకుంటున్నారట.