కరీనా అంటించిన వైరస్‌కు బలౌతున్న యువత?
ఆకలేసినా తిండి తినరు, దాహం మేసినా నీళ్లు తాగరు, తమ శరీరం కృంగి కృషించి పోతుంటే తెగ సంబరి పబతారు. ఎముకలు కనిపించేలా తమ బాడీ తయారవుతుంటే ఎగిరి గంతేసి ఏదో సాధించినట్లు ఫీలవుతారు. మరి ఎందుకు ఇదంతా అంటే ? జీరో సైజు ప్యాషన్ అంటూ బదులిస్తారు. ఒకప్పుడు ఈ ధోరణి కేవలం పాశ్చాత దేశాల్లోనే ఉండేది. కానీ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పుణ్యమా అని...ఈ వైరస్ మన దేశ యువతకు సోకింది. ఆ మధ్య ఓ సినిమాలో కరీనా జీరో సైజులో అందంగా కనిపించడతో మనదేశంలోని చాలా మంది యువతులు జీరో సైజ్ కోసం ప్రాకులాడుతున్నారు. తిండి, తిప్పలు మానేసి మరణానికి దగ్గరవుతున్నారు.
కరీనా లాంటి హీరోయిన్లు ఎక్స్ పర్ట్ పర్యవేక్షణలో శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు తీసుకుంటూ జీరో సైజ్ తెచ్చుకుంటారు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు....అలాంటివేమీ లేకుండా జీరో సైజు అంటూ తిండి, తిప్పలు మానేస్తే అనేక సమస్యలు వస్తాయని, జీరో సైజువల్ల వారు సెక్స్ కు పనికిరారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హీరోయిన్లు చూసి ఇలాంటి చేయడం మానుకోకపోతే పోషకాహార లోపంతో అనేక సమస్యలు చుట్టుముట్టి చావుకు దగ్గరవడం ఖాయం అంటున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు...హీరో, హీరోయిన్లను చూసి ప్రేక్షకులు ప్రయోగాలకు పోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











