పెళ్లైన 10 రోజులకే చిందేయనున్న కరీనా
ముంబై: సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడబోతున్న కరీనా కపూర్ పెళ్లయ్యాక పదిరోజులకే కెమెరా ముందు కనిపించనుంది. ఈ నెల 16వ తేదీన సైఫ్, కరీనాలు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం కరీనా షూటింగులకు, సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆమె షూటింగ్‌కు దూరంగా ఉండదట.
పెళ్లైన పది రోజులకే సెట్స్ మీద చిందులు వేసేందుకు సిద్ధమౌతోంది. దబాంగ్ 2 సినిమాను క్రిస్‌మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల చేయాలని హీరో సల్మాన్ ఖాన్ భావిస్తున్నారు. ఇందుకోసం చకచకా షూటింగ్ పనులు చేసుకు వెళ్తున్నారు. ఇందులో కరీనా కపూర్ ప్రత్యేక పాటలో నర్తిస్తోంది.
తన కారణంగా షూటింగ్ ఆలస్యం కావొద్దని, సినిమా అనుకున్న సమయానికి విడుదల కావాలని కరీనా కపూర్ కూడా భావిస్తుంది. ఇందుకోసం ఆమె పెళ్లైన కొద్ది రోజుల్లోనే కెమెరా ముందుకు రానుంది. ప్రేమించిన సైఫ్‌ను పెళ్లి చేసుకుంటున్న కరీనా కపూర్ కండల వీరుడి కోసం సమయం ఇచ్చేందుకు సిద్ధపడటం గమనార్హం. దబాంగ్ 2లో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











