'జబ్ వుయ్ మెట్' జంట కరీనాకపూర్, షాహిద్ కపూర్ విడిపోయినప్పటినుంచి మీడియా, పరిశ్రమ మొత్తం వీళ్ళమీదే దృష్టి కేంద్రీకరిస్తోంది. ఎవరు ఎవరితో కలిసి తిరుగుతున్నారనేదే అందరిలో నరాలు తెగిపోయే టెన్షన్. అవకాశం చూసి పుకార్లు పుట్టిద్దామనుకునేలోగా కరీనా స్పీడుగా సైఫ్ ఆలీఖాన్ తో జత కట్టింది. దాంతో వాళ్లిద్దరూ ఇప్పుడు ఒకటయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. తషాన్ సినిమా విడుదల తరువాత పెళ్ళి ఉండొచ్చని ఆమె చెప్తోంది. అసలు తషాన్ సినిమా షూటింగ్ అప్పుడే సైఫ్ కరీనాకు సన్నిహితుడయ్యూడు. సినిమా చేస్తున్నప్పుడే కేండిల్‌లైట్ డిన్నర్‌కి కరీనాను పిలిచి అక్కడే పెళ్ళికి ప్రపోజ్ చేసాడట. అంతే కాకుండా పెళ్ళి తరువాత కూడా సినిమాలలో నటిస్తానంటూ కరీనా స్టేట్ మెంట్స్ ఇస్తోంది. అంటే త్వరలో బాలీవుడ్లో మరోసారి పెళ్ళి బాజా వినిపించబోతోందన్న మాట.సర్లే గాని షాహిద్ కపూర్ దేవదాసు గెటప్ కి రెడీ అవుతాడా, చూడాలి.