చిరు పాటలకు స్టెప్పులు.. మెగాస్టార్ పాదాలు తాకి పరవశించిన యంగ్ హీరో
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న కార్తికేయ.. హిప్పీ, గుణ 369, 90 ఎమ్ఎల్ వంటి చిత్రాలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. డ్యాన్సులు, ఫైట్స్, యాక్షన్ ఇలా ప్రతీ దాంట్లో వేరియేషన్ చూపిస్తూ.. దూసుకుపోతోన్న ఈ హీరో తాజాగా ఓ వేడుకలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడని తెలుస్తోంది.
జీ సినీ అవార్డు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గత శనివారం జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి సైరా చిత్రంలో అద్భుత నటన కనబర్చినందుకు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. అయితే ఈ వేడుకలో చిరంజీవి ముందు ఆయన సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు వేశాడు హీరో కార్తికేయ.

ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. కొదమ సింహం నుంచి అమ్మడు కుమ్ముడు సాంగ్ వరకు మొత్తం 12 పాటలకు పది నిమిషాల పాటు డ్యాన్స్ చేశానని తెలిపాడు. ఆయన ముందు డ్యాన్స్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, చిరు పాదాలను తాకి పరవశించి పోయాడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన యాజమాన్యానికి, పాటలకు కొరియోగ్రఫీ చేసిన యశ్ మాష్టర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.


Click it and Unblock the Notifications











