మా ఆయన కూడా ఒప్పుకున్నారు!!

వాటిల్లో 'యు అండ్ ఐ', 'రామ్‌గోపాల్ వర్మ కీ ఆగ్', 'జూన్ ఆర్' వంటివి ఈ స్టెట్ మెంట్ తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే వేటిలోనూ ఆమె నటించడానికి ముందుకు రాలేదు. ఎటువంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు. ఇటీవల కాజోల్, మాధురీ దీక్షిత్‌ల పునరాగమనంతో ఆమె కూడా మళ్లీ వెండి తెర మీద కనిపించాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ''90ల్లో మేమంతా పోటాపోటీగా నటించాం. వారు మళ్లీ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నేను కూడా నటిస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు.
మావారు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఓ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. పూర్తిగా హీరోయిన్ గా నటిస్తానా.. అంటే చెప్పలేను. నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్పకుండా చేస్తాను. అలాంటిదే ఇప్పుడు నాదగ్గరకొచ్చిన పాత్ర. బహుశా మరో నెల రోజుల్లో ఏ విషయం ప్రకటిస్తాన''ని చెప్పుకొచ్చింది. అంటే త్వరలో కరిష్మా మనకు దర్శనమివ్వనుందన్నమాట.


Click it and Unblock the Notifications











