»   » భర్తతో విడాకులు, బోయ్ ఫ్రెండ్ తో పార్టీకు, అందరి దృష్టీ ఈ మాజి హీరోయిన్ పైనే (ఫొటోలు)

భర్తతో విడాకులు, బోయ్ ఫ్రెండ్ తో పార్టీకు, అందరి దృష్టీ ఈ మాజి హీరోయిన్ పైనే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి వివాహం చేసుకున్న హీరోయిన్ కరిష్మా కపూర్. అయితే ఆ కాపురం ఎంతో కాలం నిలవలేదు. ఆమె తన భర్త సంజయ్ కపూర్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కి కొద్ది రోజులు కాక ముందే... కరిష్మా కపూర్‌ గురించి పలు రూమర్లు బాలీవుడ్లో వినిపించాయి.

భర్తతో విడాకులు తీసుకుంటున్న ఆమె.....ఆల్రెడీ విడాకులు తీసుకున్న మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకోవడానికి సిద్దమవుతోందని. అయితే అవి కేవలం రూమర్స్ అని అంతా అనుకున్నారు. కానీ నిజమే అని రీసెంట్ గా ఓ డైరక్టర్ ఇచ్చిన పార్టీకి తన బోయ్ ఫ్రెండ్ ని తీసుకురావటంతో ఖరారు అయ్యిపోయింది. ఇప్పడు విడాకులు కూడా వచ్చాయి కాబట్టి ఇంక నో ప్లాబ్లం అన్నట్లుగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారు.

నిన్న రాత్రి ..కరిష్మా కపూర్ తన బోయ్ ఫ్రెండ్ తో కలిసి దర్శకుడు కృష్ణ డి.కె ఇంటి వద్ద కనిపించారు. ఆ పార్టీకి సైఫ్ అలీ ఖాన్, కునాల్ ఖేమ్, సోహ అలీ ఖాన్ తదితర స్టార్స్ అంతా పాల్గొన్నారు. ఈ పార్టీలో అంతా కర్మిష్మా గురించే మాట్లాడుకున్నారని బాలీవుడ్ మీడియా అంటోంది.

ఇతనే ఆమె ను పేళ్లాడేది

ఇతనే ఆమె ను పేళ్లాడేది

42 ఏళ్ల వయసున్న సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తిని కరిష్మా కపూర్ పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. సందీప్ తోష్నివాల్ సక్సెస్‌ఫుల్ ఫార్మా కంపెనీ సీఈఓగా ఉన్నారు. కరిష్మా మాదిరిగానే...సందీప్ తోష్నివాల్‌కు కూడా ఆల్రెడీ భార్యతో విడాకులై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చాలా ఉషారుగా

చాలా ఉషారుగా

ఇక ఈ పార్టీలో అందరికన్నా ఎక్కువ ఉషారుగా ఉన్నది వీళ్ళిద్దరే అంటున్నారు. ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుని మాట్లాడుకోవటం, టీనేజ్ జంటలా కంటిన్యూగా ముచ్చట్లు, ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకపోవటం, ప్రక్కనున్న ప్రపంచాన్ని పట్టించుకోకపోవటం జరిగిందిట.

బెడ్ రూమ్ ప్లాట్

బెడ్ రూమ్ ప్లాట్

అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ ...ముంబైలో ప్రస్తుతం విశాలంగా ఉండే త్రి బెడ్ రూం ప్లాట్ కోసం అన్వేషిస్తున్నాడట. ఆ ఇంటిని కొని కరిష్మాకు గిప్ట్ గా ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఆమె తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆ ఇంటిలోకి షిప్ట్ అవుతుందిట. ఆ తర్వాత పెళ్లి గురించి ప్లాన్ చేస్తారట.

మరిది గారి మద్దతుతోనే..

మరిది గారి మద్దతుతోనే..

తన కుటుంబంలో కి కొత్త మెంబర్ ని ఆహ్వానిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ..ఈ జంటను తమతో పాటు తెచ్చారట. ఎందుకంటే సైఫ్ వదినగారే కదా...కరిష్మా. చాలా హ్యాపీగా ఉన్నాడు సైఫ్ అలీ ఖాన్. మీడియాకు ఇలా ఫోజులు కూడా ఇచ్చాడు. వీరి లవ్ స్టోరీ కు సైఫ్ పూర్తి మద్దతు ఇస్తున్నారట.

మరో కపుల్ కూడా ఇక్కడే

మరో కపుల్ కూడా ఇక్కడే

ఈ పార్టీలో మరో జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ జంట మరేదో కాదు..కునాల్, సోహా అలీ ఖాన్. సైఫ్ సోదరి అయిన సోహా కూడా తన బోయ్ ఫ్రెండ్ తో కలిసి ఇక్కడ కు వచ్చింది. సైఫ్ అటు తమ వదిన గారు, ఇటు తన చెల్లితో కలిసి అప్పుడప్పుడూ కబుర్లు చెప్తూ సందడి చేసారు. మొత్తానికి ఇదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగ మారిపోయింది.

English summary
Karisma Kapoor attended a party along with her alleged boyfriend Sandeep Toshniwal. If reports are to be believed, the Dil Toh Pagal Hai actress, who recently divorced her husband Sunjay Kapur, is all set to start a fresh chapter in her life!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu