రెండో పెళ్లికి ప్రముఖ నటి రెడీ.. బాయ్‌ఫ్రెండ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా..
Recommended Video

పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్‌తో విడాకులు పొందిన తర్వాత ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతున్నది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న సందీప్ తోష్నివాల్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కరీష్మా పెళ్లిపై ఆమె తండ్రి, నటుడు రణధీర్ కపూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆ వార్తకు బలం చేకూరుతున్నది. కరిష్మా కపూర్ జీవితంపై ఓ సారి కన్నేస్తే..

కెరీర్ పీక్‌లో ఉండగానే..
రాజా హిందూస్థానీ, దిల్ తో పాగల్ హై లాంటి బ్లాక్‌బస్టర్లతో మంచి జోరు మీద ఉండగానే జూనియర్ బచ్చన్ అభిషేక్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకొని 2003లో పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లాడింది. వారికి సమైరా అనే కూతురు, కియాన్ అనే కుమారుడు ఉన్నాడు.

భర్తపై వరకట్న వేధింపుల కేసు
సంజయ్ కపూర్‌తో దాంపత్యంలో విభేదాలు రావడంతో తనను వేధిస్తున్నాడని కరిష్మా కపూర్ వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. గతేడాది కోర్టు వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. దాంతో వారిద్దరూ అధికారికంగా విడిపోయారు.

బాయ్‌ఫ్రెండ్‌తో కరిష్మా జోష్
కోర్టులో విడాకుల కేసు కొనసాగుతుండగానే తన బాయ్‌ఫ్రెండ్ సందీప్‌తో చనువుగా కలిసి తిరుగుతున్నట్టు మీడియా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత డిన్నర్ డేట్‌కు వెళ్లిన కరిష్మా, సందీప్‌లు మీడియా కెమెరాలకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. దాంతో వీరిద్దరి మధ్య అఫైర్ సాగుతుందనే వాదనకు బలం చేకూరింది.

బాయ్‌ఫ్రెండ్‌కు విడాకులు మంజూరు
కరిష్మా బాయ్‌ఫ్రెండ్ సందీప్‌కు కూడా ఇటీవల తన భార్యతో విడాకులు మంజూరయ్యాయి. దాంతో కరిష్మా పెళ్లికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే కరిష్మా, సందీప్ రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తున్నది. కరిష్మా రెండో పెళ్లిపై ఆమె తండ్రి రణధీర్ ఇలా స్పందించారు.

కరిష్మా పెళ్లి చేసుకోవాలనుకొంటే
ఒకవేళ కరిష్మా పెళ్లి చేసుకోవాలనుకుంటే అందుకు నా ఆశీస్సులు ఉంటాయి. ఆమెకు వయసు మీరిపోలేదు. సందీప్‌ను ఇష్టపడుతున్నది. వారిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోలను మీడియాలో చూశాను. కరిష్మా బాగా సెటిల్ అయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేనెప్పుడు కరిష్మాతో ఈ విషయం గురించి మాట్లాడలేదు.

కరిష్మా కపూర్ మంచి తల్లి..
ఇద్దరి బిడ్డలకు తల్లిగా చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నది. నా తెలిసి కరిష్మా పెళ్లి చేసుకుంటుందని నేను అనుకొను. లోలో (కరిష్మా) మంచి తల్లి. ఆమె ఇప్పుడు రెండో వివాహం గురించి ఆలోచిస్తున్నదని అనుకొను అని రణధీర్ కపూర్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











