»   » ఇండస్ట్రీలో హాట్ టాపిక్: ఆయనకు మూడో వివాహం.... ఆమెకు రెండో పెళ్లి (ఫోటోస్)

ఇండస్ట్రీలో హాట్ టాపిక్: ఆయనకు మూడో వివాహం.... ఆమెకు రెండో పెళ్లి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్.... ఇటీవలే తన భర్త సంజయ్ కపూర్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. సంజయ్ కపూర్ ఇపుడు మరో వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇది మూడో వివాహం. సంజయ్ ఈ సారి కూడా సినీ రంగానికి చెందిన ప్రియా సచ్‌దేవ్ అనే నటి, మోడల్‌ని. సంజయ్ కపూర్ వివాహం ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.... ఢిల్లీలో గురువారం సంజయ్ కపూర్-ప్రియా సచ్ దేవ్ వివాహం జరిగినట్లు సమాచారం.

రిజిస్టర్ మ్యారేజ్

రిజిస్టర్ మ్యారేజ్

ఢిల్లీలో వీరు సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే న్యూయార్కులో గ్రాండ్ గా అందరికీ పార్టీ ఇవ్వబోతున్నారట.

ప్రియా-సంజయ్ రిలేషన్ షిప్

ప్రియా-సంజయ్ రిలేషన్ షిప్

ప్రియా సచ్ దేవ్, సంజయ్ కపూర్ గత ఐదేళ్లుగా డేటింగులో ఉన్నారట. అయితే ఈవిషయం ఇంతకాలంగా గోప్యంగానే ఉంది. రహస్యంగా కలుసుకోవడం లాంటివి చేసేవారట.

ఇది ప్రియాకు రెండో వివాహం

ఇది ప్రియాకు రెండో వివాహం

సంజయ్ కపూర్ తో ప్రియాకు ఇది రెండో వివాహం. గతంలో ఆమె యూఎస్ బేస్డ్ హోటలియర్ సంత్ చత్వాల్ కుమారుడు విక్రమ్ ను పెళ్లాడారు. అప్పట్లో వీరి వివాహం ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లయిన కొంతకాలానికే వీరు విడిపోయారు.

సంజయ్ కపూర్ కు ఇది మూడో వివాహం

సంజయ్ కపూర్ కు ఇది మూడో వివాహం

సంజయ్ కపూర్ మొదటి వివాహం నందిత మహ్తానితో జరిగింది. ఆమెతో విడిపోయిన తర్వాత కరిష్మా కపూర్ ను రెండో వివాహం చేసుకున్నాడు. ఇపుడు ప్రియా సచ్ దేవ్ ను మూడో వివాహం చేసుకున్నారు.

ప్రియా గురించి...

ప్రియా గురించి...

ప్రియా సచ్ దేవ్ ఢిల్లీకి చెందిన బిజినెస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసింది. తర్వాత సంవత్సరం పాటు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా చేసింది. తర్వాత జాబ్ వదిలేసి మోడలింగ్, యాక్టింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఉదయ్ చోప్రా, తానిషా ముఖర్జీ నటించిన ‘నీల్ అండ్ నిక్కీ' మూవీలో నటించింది.

English summary
Karisma Kapoor's ex Sunjay Kapur tied the knot recently with Priya Sachdev, who is a model-cum-actress. She also did a cameo in Uday Chopra and Tanisha Mukherjee-starrer Neal 'n' Nikki. As per a report in a leading web portal, Sunjay Kapur and Priya Sachdev got married in New Delhi yesterday. More details below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu