విడాకులైన వ్యక్తితో హీరోయిన్ రెండో పెళ్లి?
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్ నుండి విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కారు. తాజాగా కరిష్మా కపూర్ గురించి పలు రూమర్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. భర్తతో విడాకులు తీసుకుంటున్న ఆమె.....ఆల్రెడీ విడాకులు తీసుకున్న మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకోవడానికి సిద్దమవుతోందట.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం..39 ఏళ్ల వయసున్న సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తిని కరిష్మా కపూర్ పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. సందీప్ తోష్నివాల్ సక్సెస్‌ఫుల్ ఫార్మా కంపెనీ సీఈఓగా ఉన్నారు. కరిష్మా మాదిరిగానే...సందీప్ తోష్నివాల్‌కు కూడా ఆల్రెడీ భార్యతో విడాకులై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ మధ్య విడాకుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ లోపే ఆమె రెండో పెళ్లి గురించిన వార్తలు ప్రచారంలోకి రావడం చర్చనీయాంశం అయింది. గమనించదగిన విషయం ఏమిటంటే కరిష్మా కపూర్ ప్రస్తుత భర్త సంజయ్ కపూర్ కూడా ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకున్నవాడే.
ఇపుడు అతనితో విడిపోయిన తర్వాత కూడా...... మళ్లీ పెళ్లయి విడాకులైన సందీప్ తోష్నివాల్‌ను పెళ్లాడటానికి సిద్ధమవుతోంది కరిష్మా. అదే జరిగితే......రెండు వివాహాలు రెండో పెళ్లి వాళ్లనే చేసుకున్న హీరోయిన్‌గా కరిష్మా చరిత్రకెక్కనుంది. ఇంతకీ సందీప్ తోష్నివాల్‌తో కరిష్మా వివాహం జరుగుతుందా? లేదా? అనేది పెళ్లి భాజా మ్రోగే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











