మెగా సినిమాలో పెళ్ళైన హీరోయిన్ ఐటం సాంగ్
రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన 'విక్రమార్కుడు' చిత్రాన్ని హిందీలో మెగా బడ్జెట్ తో విక్రమ్ రాధోడ్ టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లో ఐటం సాంగ్ కోసం పెళ్లైన హీరోయిన్ కరిష్మాకపూర్ ఐటం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. 'చిక్నీ ఛమేలీ' తరహాలోనే ఈ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల్లో ముంబయిలోనే షూట్ చేస్తారు. 'మున్ని బద్‌నామ్', 'షీలా కీ జవానీ', 'చిక్నీ ఛమేలీ'..తరహాలో ఈ పాట సూపర్ హిట్టవుతుందని చెప్తున్నారు. అలాగే జూన్ 15న 'రౌడీ రాథోడ్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్,సోనాక్షి సిన్హా కలిసి నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా కసరత్తులు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది.


Click it and Unblock the Notifications











