»   »  విడాకులు రద్దు చేసుకున్న టాప్ హీరోయిన్, డబ్బే కారణమా?

విడాకులు రద్దు చేసుకున్న టాప్ హీరోయిన్, డబ్బే కారణమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నిన్నటితరం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్ విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది విడాకులు పైల్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అయితే తాజాగా ఆమె విడాకుల పిటీషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.

అయితే కొన్ని ఇద్దరి మధ్య కొన్ని విషాయాలు పరిష్కారం కాక పోవడంతో విడాకుల ప్రక్రియ ఓ కొలిక్కి రావడం లేదు. గతంలో పలు వాయిదాల్లో వారిరువురు ఒక ఒప్పందానికి రాకపోవడంతో మళ్లీ కేసు వాయిదా మీద వాయిదా పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరూ ఒప్పందానికి రాకపోతే పిటీషన్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఇపుడు అదే జరిగింది.

విడాకుల నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం భర్త నుండి ఆమెకు రావాల్సిన ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె విడాకుల పిటీసన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కరిష్మాకు సంజయ్ కపూర్‌తో 2003 లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అనంతరం 2010 నుంచి కరిష్మా ముంబైలోని తన పుట్టింట్లో ఉంటుంది.

Karisma And Sunjay's Divorce Called Off, Why?

పిల్లల కొరకు బాంద్రా కోర్టులో సంజయ్ గతంలో కస్టడీ పిటీషన్ దాఖలు చేశారు. అందులో వేరొకరితో కరిష్మా డేటింగ్ చేస్తోందని పేర్కొన్నాడు. ఫార్మా కంపెనీ అధినేత సందీప్ తోష్నివాల్‌తో కరిష్మా ప్రేమాయణం సాగిస్తుందని బాలీవుడ్‌లో ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం..39 ఏళ్ల వయసున్న సందీప్ తోష్నివాల్‌ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కరిష్మా కపూర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సందీప్ తోష్నివాల్ సక్సెస్‌ఫుల్ ఫార్మా కంపెనీ సీఈఓగా ఉన్నారు. కరిష్మా మాదిరిగానే...సందీప్ తోష్నివాల్‌కు కూడా ఆల్రెడీ భార్యతో విడాకులు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

English summary
Bollywood actress Karisma Kapoor who had filed for a divorce from her husband Sunjay Kapur, has now decided to withdraw her consent to the petition.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu