ఏ ధైర్యంతో ఆరంజ్ కుపోటీగా విడుదల చేస్తున్నారు..
రామ్ చరణ్ తేజ్ లవర్ బాయ్ గాఈనెల చివరలో ఆరంజ్ గామన ముందుకు రాబోతున్నారు. ఈసినిమా విడుదలను దృష్టిలో పెట్టుకోని చాలా సినిమాలు విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. ఐతే ఆరంజ్ కిపోటీగా అడవి శేషు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కర్మ అనే విభిన్నమైన సినిమాని పోటీగా విడుదలంతో ఫిలిమ్ సిటీ పెద్దలు ఏ దైర్యంతో అలా విడుదల చేయడానికి సాహాసించారని అనుకుంటున్నారు. ఇక కర్మ విషయానికి వస్తే థౌజండ్ లైట్స్ పతాకంపై, హాలీవుడ్ నటి జేడ్ టేలర్ పద్మ అనే పాత్రలో హీరోయిన్ గా, అడవి శేషు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన విభిన్న కథా చిత్రం కర్మ. ఈ చిత్రానికి డు యు బిలీవ్ అన్న క్యాప్షన్ ని నిర్ణయించారు. ఈ చిత్రాన్ని భవానీ అడవి, హర్షసింగ్, షేర్ ఆలీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు సంవత్సరాలు కష్టపడి, పూర్తిగా అమెరికాలోనే పూర్తి అంకిత భావంతో నిర్మించటం విశేషం. ఇది సూపర్ నేచ్యురల్ చిత్రమైనప్పటికీ ఈ చిత్రంలో ఎక్కడా దెయ్యాలూ, భూతాలూ ఉండవని ఈ చిత్ర దర్శకులు అడవి శేషు మీడియాకు తెలిపారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "ఆరెంజ్" విడుదల రోజైన నవంబర్ 26వ తేదీనే విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











