బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడిన 100 మంది తెలుగు సెలబ్రిటీలు.. ఎవరు నిర్వహించారంటే?
ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలు ఎక్కువ అవుతున్నాయి. సీరియల్ నటులతో పాటు సినిమా నటులు కూడా ఎక్కువగా ఇలాంటి పార్టీల్లో పాల్గొంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బు ఉన్న ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సైతం ఇలాంటి పార్టీల్లో పాల్గొంటూ రచ్చ చేస్తున్నారు. పోలీసులకు చిక్కితే మాత్రం ఊచలు లెక్కబెడుతూ.. కేసుల నుంచి తప్పుకునేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. అయితే తాజాగా బెంగళూరులో ఓ రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే వాళ్లు ఎవరెవరు అసలు పార్టీ ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం రోజు అర్థరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్డ్ డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగగా.. పోలీసులు దాడి చేశారు. వారికి వచ్చిన పక్కా సమాచారంతోనే దాడి చేయగా.. 100 మందికి పైగా పట్టుబడినట్లు తెలుస్తోంది. అందులో పాతిక మందికి పైగా సినీ నటులు, అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్, దొరకగా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.

బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీని హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకలను జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి పేరిట ఆ ఫామ్ హౌస్ ఉండగా.. ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ పేరిట కారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసు నమోదు చేసుకున్నసిటీ ఎలక్ర్టానిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే ఘటనా స్థలిలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్ తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ పార్టీలో తెలుగు నటి హేమ కూడా పాల్గొన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. కానీ పూర్తిగా విచారణ సాగే వరకు ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనేది మాత్రం తెలియదు. చూడాలి మరి ఈ కేసులో ఎంత మంది పాల్గొన్నారనేది.


Click it and Unblock the Notifications











