twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుదీప్ - దేవగన్ వివాదానికి పొలిటికల్ టచ్.. మా హీరోనే కరెక్ట్ అంటున్న నేతలు

    |

    హిందీ మీద నటుడు సుదీప్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఈ విషయంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్పందించగా ఇప్పుడు ఈ విషయంలో సుదీప్ కు మద్దతు లభిస్తోంది. ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కుమారస్వామి గౌడా సుదీప్ కి మద్దతుగా ట్వీట్లు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    సుదీప్ హిందీ రచ్చ

    సుదీప్ హిందీ రచ్చ

    కన్నడ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈగ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత బాహుబలి, సైరా సినిమాలలో కీలక పాత్రలలో నటించి తెలుగు వారికి దగ్గరయ్యాడు. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ అందరూ కన్నడ సినిమా హిందీలో విడుదల చేసి హిట్ కొట్టారు అని అంటున్నారని కానీ అది కన్నడ సినిమా కాదని అన్నారు.

    హిందీ మీద కీలక వ్యాఖ్యలు

    హిందీ మీద కీలక వ్యాఖ్యలు

    అది ఒక పాన్ ఇండియా సినిమా అని, బాలీవుడ్ వాళ్లు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా సరే అవి ఆడటం లేదు కానీ దక్షిణాది సినిమాలు మాత్రమే ఆ స్థాయిలో ఆడుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతే కాక ఇకపై హిందీ మన జాతీయ భాష కాదంటూ సుదీప్‌ కామెంట్ చేశారు. సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గన్‌ హిందీ జాతీయ భాష కానప్పుడు మీ చిత్రాలను హిందీలో ఎందుకు డబ్‌ చేస్తున్నారని ట్వీట్‌లో ప్రశ్నించారు.

    తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే

    తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే


    జాతీయ భాషగా ఎప్పటి నుంచో హిందీ ఉందని ఎప్పటికీ అదే ఉంటుందని ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. దీనిపై మళ్లీ ట్విటర్‌ వేదికగా స్పందించిన సుదీప్‌ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను తాను చదవగలిగానని, కానీ తాను కన్నడలో ట్వీట్‌ చేస్తే మీ పరిస్థితి ఏంటని అజయ్‌ దేవ్‌గణ్​ను ప్రశ్నించారు. ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలా జరుగుతుంటుందని ట్వీట్‌లో కౌంటర్ కూడా ఇచ్చాడు.

    విమర్శించిన ముఖ్యమంత్రి

    విమర్శించిన ముఖ్యమంత్రి

    అయితే ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటే ఇద్దరి నటుల ట్వీట్ల వార్‌లోకి రాజకీయ నాయకులు ఎంట్రీ ఇచ్చాడు. సుదీప్‌ వ్యాఖ్యలను సమర్థించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై భాషా ప్రాతిపదికనే కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సుదీప్‌ వ్యాఖ్యలు సమంజసమే అన్న బొమ్మై, ఆ వ్యాఖ్యలను గౌరవించాలని పేర్కొన్నారు. మరో పక్క అజయ్‌ దేవగన్‌ వ్యాఖ్యలను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు. హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదన్న సిద్ధరామయ్య, దేశంలో భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ట్వీట్‌ చేశారు.

    కుమారస్వామి మద్దతు

    కుమారస్వామి మద్దతు

    ఇక బీజేపీ హిందీ జాతీయ‌వాదానికి అజ‌య్ దేవ‌గ‌న్ ఓ ప్ర‌చార‌కుడిగా మారార‌ని మాజీ సీఎం కుమార‌స్వామి ఆరోపించారు. హిందీ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను క‌న్న‌డ సినిమా దాటిందని దేవ‌గ‌న్ గ్ర‌హించాల‌న్నారు. క‌న్న‌డ ప్ర‌జ‌ల ప్రోత్సాహంతోనే హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ వృద్ధి సాధించింద‌న్న ఆయన అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన తొలి చిత్రం పూల్ ఔర్ కాంటే బెంగుళూరులో ఏడాది పాటు ప్ర‌ద‌ర్శించార‌ని కుమార‌స్వామి గుర్తు చేశారు. హిందీ వివాదంపై క‌న్న‌డ న‌టుడు కిచ్చా సుదీప్ చేసిన ట్వీటుతో వివాదం మొదలైంది.

    English summary
    karnataka political leaders back Sudeep amid spat with Ajay devgn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X