twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పద్మావత్'పై కర్ణిసేన యూటర్న్: గొప్పగా చూపించారని ప్రశంసలు..

    |

    నిన్న మొన్నటిదాకా 'పద్మావత్' సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కర్ణిసేన.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. 'పద్మావత్' సినిమా చూసి సేన కార్యకర్తలు మనసు మార్చుకున్నారు. ఇక సినిమాకు ఎటువంటి ఆటంకాలు కలిగించమని హామి ఇవ్వడంతో పాటు.. 'పద్మావత్' గొప్పగా ఉందంటూ ప్రశంసించారు.

    గొప్పగా చూపించారు: కర్ణిసేన

    గొప్పగా చూపించారు: కర్ణిసేన

    కర్ణిసేనకు చెందిన కొందరు ప్రముఖులు తాజాగా 'పద్మావత్‌' సినిమా చూశారు. సినిమాలో రాజ్‌పుత్‌లను గొప్పగా చూపించారని, ఈ సినిమా తమ గౌరవాన్ని మరింత పెంచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన ముంబయి నాయకుడు యోగేంద్ర సింగ్‌ కటార్‌ అభిప్రాయపడ్డారు.

    'పద్మావతి'కి సెన్సార్ బిగ్ షాక్: క్లియరెన్స్ ఇచ్చినట్లే ఇచ్చి!..'పద్మావతి'కి సెన్సార్ బిగ్ షాక్: క్లియరెన్స్ ఇచ్చినట్లే ఇచ్చి!..

    Recommended Video

    రాణి పద్మావతి బాటలో ఆత్మాహుతి.. రోడ్డెక్కిన మహిళలు !
    'ప్రతి రాజ్‌పుత్‌ గర్వపడే సినిమా'

    'ప్రతి రాజ్‌పుత్‌ గర్వపడే సినిమా'


    కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ సూచన మేరకు ముంబైలో 'పద్మావత్' సినిమా చూసినట్లు కర్ణిసేన కార్యకర్తలు తెలిపారు. ప్రతి రాజ్‌పుత్‌ సినిమా చూసి గర్వపడతారని చెప్పారు. ఇకపై కర్ణిసేన సినిమాపై ఎలాంటి ఆందోళనలు చేపట్టవద్దని పిలుపునిచ్చారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శనకు సహకరిస్తామని ప్రకటించారు.

    కర్ణిసేన ఆందోళనలు..:

    కర్ణిసేన ఆందోళనలు..:

    సినిమాలో రాజ్‌పుత్‌ మహారాణి పద్మినిని కించపరిచారని, ఆమె జీవిత చరిత్రను వక్రీకరించారని గత కొన్ని నెలలుగా కర్ణిసేన తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 25న సినిమా విడుదల సందర్భంగా ఈ ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో కర్ణిసేన నాయకులు, కార్యకర్తలు బస్సుల్ని వాహనాల్ని దగ్దం చేశారు. పలు మాల్స్ కు నిప్పంటించారు.

    శాంతించాలని చెప్పినా..:

    శాంతించాలని చెప్పినా..:

    కర్ణిసేన ఆందోళనల నేపథ్యంలో ' పద్మావతి' టైటిల్ కాస్త 'పద్మావత్'గా మారిన సంగతి తెలిసిందే. సినిమాలో 26సీన్లకు కూడా సెన్సార్ కత్తెర వేసింది. సినిమా విడుదల సందర్భంగా.. ఇదో కల్పిత కథ అని ఎవరిని ఉద్దేశించి తీయలేదని చిత్ర యూనిట్ కూడా వివరణ ఇచ్చింది. అయినా కర్ణిసేన శాంతించలేదు.

    ఆ సినిమా ఆపేస్తారా?:

    ఆ సినిమా ఆపేస్తారా?:

    కర్ణిసేన కార్యకర్తలు సినిమా చూడకుండానే థియేటర్స్‌ను ముట్టడించడం విమర్శలకు తావిచ్చింది. అయినా సరే, వాళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మాత్రం స్వయంగా వారే సినిమా చూసి 'పద్మావత్'ను ప్రశంసిస్తుండటం గమనార్హం. భన్సాలీకి కౌంటర్‌గా ఆయన తల్లిపై ఓ సినిమా కూడా చేయబోతున్నట్లు ప్రకటించిన కర్ణిసేన.. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని కూడా ఇక నిలిపేస్తుందా?..

    English summary
    After more than a year of launching massive protests against Sanjay Leela Bhansali’s Padmavati, later christened Padmaavat, for allegedly distorting history, Karni Sena announced on Friday that it decided to take back its protest and accepted that the movie glorifies the valour of the Rajputs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X