'లీలా కీ లీలా'.. భన్సాలీ తల్లిపై సినిమా: కర్ణిసేన సంచలనం, దర్శకుడు ఎవరంటే?

Recommended Video

'లీలా కీ లీలా'.. భన్సాలీ తల్లిపై సినిమా.. కర్ణిసేన సంచలనం..!

వివాదాలే నడుమనే విడుదలైన 'పద్మావత్' హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్‌లో 'వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్స్'గా ఈ సినిమా నిలిచిపోతుందన్న ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఇక కర్ణిసేన ఆరోపిస్తున్నట్లు ఈ సినిమాలో 'పద్మావతి' పాత్రను ఎక్కడా అసభ్యంగా చూపించలేదని, అలాగే రాజ్‌పుత్‌ల గురించి గొప్పగా చెప్పారు తప్పితే ఎక్కడా వాళ్లను తక్కువ చేయలేదని చెబుతున్నారు. అయినా సరే, కర్ణిసేన మాత్రం శాంతించడం లేదు. నిన్న మొన్నటిదాకా దాడులతో వివాదాన్ని రాజేసిన కర్ణిసేన.. ఇప్పుడు భన్సాలీకి కౌంటర్‌గా సినిమా మొదలుపెడుతామని ప్రకటించడం గమనార్హం.

భన్సాలీ తల్లిపై సినిమా:

భన్సాలీ తల్లిపై సినిమా:

'పద్మావత్' చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తల్లి జీవితాధారంగా సినిమా తీస్తామని రాజస్థాన్‌కు చెందిన కర్ణిసేన ప్రకటించింది. తమ వాదనను, ఆందోళనను లెక్క చేయకుండా 'పద్మావత్'ను విడుదల చేసినందుకు ఆయన తల్లిపై సినిమా చేసి తీరుతామని ప్రకటించింది.

 టైటిల్ 'లీలా కీ లీలా'..:

టైటిల్ 'లీలా కీ లీలా'..:

భన్సాలీ తల్లి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తామని, దీనికి 'లీలా కీ లీలా' అనే టైటిల్ పెట్టబోతున్నామని కర్ణిసేన కార్యకర్తలు వెల్లడించారు. చిత్తోర్‌గఢ్‌ ప్రాంగణంలో కర్ణిసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ మీడియాతో సమావేశమైన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు.

 దర్శకుడెవరు?:

దర్శకుడెవరు?:

మరో 15 రోజుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ తల్లిపై సినిమా మొదలుపెట్టబోతున్నామని, అరవింద్ వ్యాస్ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తాడని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ అంతా రాజస్థాన్ లోనే జరుగుతుందని చెప్పారు.

 అవమానించినందుకే!:

అవమానించినందుకే!:

భన్సాలీ తమ తల్లి 'పద్మావతి'ని అవమానించాడు కాబట్టే.. ఇప్పుడు మేము ఆయన తల్లి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయబోతున్నామని కర్ణిసేన వెల్లడించింది. అయితే భన్సాలీ తమ తల్లిని అవమానించాడని, సినిమాలో మేము ఆయన తల్లిని అవమానించమని కర్ణిసేన పేర్కొనడం గమనార్హం.

 ప్రివ్యూ కలెక్షన్స్:

ప్రివ్యూ కలెక్షన్స్:

భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావత్' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు బుధవారం పలు చోట్ల ప్రివ్యూలు ప్రదర్శించారు. ప్రివ్యూల ద్వారా రూ.5కోట్ల కలెక్షన్లు వసూలైనట్లు సమాచారం. సినిమాకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల జోరు మరింత పెరగనుంది. సినిమాలో దీపికా, షాహిద్, రణ్ వీర్‌ల నటన అద్భుతంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X