twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొంగచాటుగా మార్చురీలోకి రియా చక్రవర్తి.. సుశాంత్ మృతి వెనుక మాస్టర్ మైండ్ అతనే.. ప్రత్యక్ష సాక్షి

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత సంచలనాత్మక రీతిలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ మరణాంతరం ఆయన మృత దేహాన్ని కూపర్ హాస్పిటల్‌కు తరలించిన సమయంలో ఆమె ఎవరి కంటా పడకుండా మార్చురీలోకి వెళ్లిందనే వార్తలను ధృవీకరిస్తూ ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన విషయాలు ముంబై పోలీసు, మీడియా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రత్యక్ష సాక్షి, కర్ణిసేనకు చెందిన సూర్జిత్ సింగ్ రాథోడ్ రిపబ్లిక్ టీవీకి వెల్లడించిన వెల్లడించిన ప్రకారం..

    Recommended Video

    Sushant Singh Rajput : Sushant మృతి కేసులో హంతకుడు అతనే..! -సూర్జిత్ సింగ్ రాథోడ్ | Oneindia Telugu
    సందీప్ సింగ్ మృతదేహాన్ని

    సందీప్ సింగ్ మృతదేహాన్ని

    కర్ణిసేనకు చెందిన సూర్జిత్ సింగ్ మరో విషయాన్ని వెల్లడిస్తూ.. పెద్ద అంబులెన్స్‌లో సుశాంత్ సింగ్ మృతదేహాన్ని తీసుకొని ఆయన స్నేహితుడిగా పేర్కొంటున్న సందీప్ సింగ్ వచ్చాడు. ఆయనతోపాటు మరో పోలీస్ అధికారి కూడా ఉన్నారు. వారిద్దరు కొన్ని డాక్యుమెంట్లు పంచుకొన్నారు. కాసేపు కొంత సేపు మాట్లాడుకొని వెళ్లిపోయారు అని తెలిపారు.

    సందీప్ నాతో దురుసుగా

    సందీప్ నాతో దురుసుగా

    కూపర్ హస్పిటల్ వద్ద నాతో సందీప్ సింగ్ దురుసుగా ప్రవర్తించారు. మృతదేహాన్ని తీసుకొనే ముందు హాస్పిటల్ వర్గాలు అందించే పత్రాలపై సంతకం చేయడానికి నిరాకరించారు. మరో వ్యక్తి వచ్చి సంతకం చేశారు. బీఎంసీకి అతనే లెటర్ ఇచ్చారు అని సూర్జిత్ సింగ్ పేర్కొన్నారు.

    ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశా

    ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశా

    సుశాంత్ సింగ్ మృతి తర్వాత కూపర్ హస్పిటల్‌లో సందీప్ సింగ్ వ్యవహరించిన తీరుపై బాంద్రా పోలీసులకు రాతపూర్వకమైన ఫిర్యాదు చేశాను. పలు మార్లు పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాను. కానీ వారు పట్టించుకొన్నట్టు లేరు. అయినా బాంద్రా డీసీపీ త్రిముఖే‌కు జూన్ 27, 28 తేదీల మధ్య ఫోన్ చేసి చెప్పాను అని సూర్జిత్ సింగ్ చెప్పారు.

    సుశాంత్ మృతి వెనుక మాస్టర్ మైండ్ అతడే

    సుశాంత్ మృతి వెనుక మాస్టర్ మైండ్ అతడే

    కూపర్ హాస్పిటల్ వద్ద ప్రత్యక్ష సాక్షి సూర్జిత్ సింగ్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్‌కు స్నేహితుడని చెప్పుకొనే వ్యక్తే ఆయన హత్యలో కీలక సూత్రధారి. ఆయనే అంతా వెనుక ఉండి నడిపించాడు. కూపర్ హస్పిటల్ వద్ద వ్యవహరించిన తీరు చూస్తే ఆయనే మాస్టర్ మైండ్. అతడే హంతకుడు అని ఆరోపించారు.

    దొంగచాటుగా రియా చక్రవర్తి

    దొంగచాటుగా రియా చక్రవర్తి

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహం మార్చురీలో ఉండగా, రియా చక్రవర్తి, తన సోదరుడు, తల్లితో కలిసి హాస్పిటల్‌కు వచ్చారు. ఎవరికి కనిపించకుండా మార్చురిలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకొన్నాు. అక్కడ ఉండే సెక్యూరిటీని ప్రాధేయపడితే ఆమె ఒక్కరినే పంపించారు. సుశాంత్ దేహంపై ఉన్న తెల్లటి వస్త్రాన్ని తీయగానే.. సారీ బాబూ అంటూ హృదయం మీద చేతులు వేసుకొన్నది.

    English summary
    Karni Sena's Surjeet Singh Rathore allegation on Sandip Ssingh as Master Mind in Sushant Singh Rajput's death. He was most suspicious man at cooper hospital. Rhea Chakraborty visited to hospital to see Sushant Singh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X