హీరోయిన్ ముక్కుకోస్తాం, థియేటర్ల విధ్వంసమే: దర్శకుడికి హెచ్చరిక
తాజాగా కర్ణిసేన "హిందువుల మనోభావాలను దర్శకుడు బన్సాలీ దెబ్బతీశారు. సినిమా విడుదల చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తాం, దీపికా పదుకుణే ముక్కుకోస్తాం" అంటూ హెచ్చరికలు చేసారు.
రిలీజ్ సమయ దగ్గర పడుతున్న కొద్దీ సంజలీలా భన్సాలీ సినిమా పద్మావతి పై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే పలు సంఘాలు సినిమా విడుదల ఆపాలంటూ ఆందోళనలు చేస్తుండగా.. చిత్రయూనిట్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదలను అడ్డుకుంటాం అంటూ కర్ణిసేన హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో దీపిక సినిమా విడుదలపై స్పందించిన తీరు వివాదాన్ని మరింత పెంచింది.ఆ చిత్రంలో పద్మావతి పాత్రను వక్రీకరించారని ఆ చిత్ర విడుదలను నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మహిళగా గర్వపడుతున్నాను
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా 'పద్మావతి' చిత్ర విడుదలను ఆపలేరని ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే చెప్పింది. ఆ చిత్రంలో నటించినందుకు ఒక మహిళగా తాను చాలా గర్వపడుతున్నానని తెలిపింది.అయితే ఆ ప్రకటన వెలువడిన రోజే పద్మావతి చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించిన థియేటర్ పై దాడి జరిగింది.

ఆకాశ్ థియేటర్ పై దాడి
మాకు చూపించకుండా ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లపై దాడి చేస్తాం...అంటూ కొన్నాళ్లుగా వస్తున్న బెదిరింపులను నిజం చేస్తూ రాజస్థాన్ లోని కోటాలో ఉన్న ఆకాశ్ థియేటర్ ను కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్ పుత్ వర్గీయులు ధ్వంసం చేశారు. కర్ణిసేన కార్యకర్తలు రాజ్ పుత్ వర్గీయులు ఆకాశ్ థియేటర్ పై దాడి చేసి కౌంటర్ అద్దాలను కిటికీలను ధ్వంసం చేశారు.

కేవలం సెన్సార్ బోర్డ్ కు మాత్రమే
సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దీపిక, పద్మావతి రిలీజ్ ను ఎవరు ఆపలేరని, తాము కేవలం సెన్సార్ బోర్డ్ కు మాత్రమే జవాబు దారి అనటం నిరసనకారులకు మరింత కోపాన్ని తెప్పించింది. తాజాగా కర్ణిసేన పద్మావతి సినిమాపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

దీపికా పదుకుణే ముక్కుకోస్తాం
"సినిమా విడుదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం, హిందువుల మనోభావాలను దర్శకుడు బన్సాలీ దెబ్బతీశారు. సినిమా విడుదల చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తాం, ఈ సినిమా విడుదల అయితే దీపికా పదుకుణే ముక్కుకోస్తాం" అంటూ హెచ్చరికలు చేసారు.


Click it and Unblock the Notifications











