twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా వివాదం: అప్పుడు దర్శకుడుపై తుపాకులతో దాడి.. ఇప్పుడు మరోసారి ..అద్దాలు పగలకొట్టి

    రాజస్థాన్‌లోని 13వ శతాబ్దానికి చెందిన చారిత్రక చిత్తోడ్‌గఢ్‌ కోటపై కర్ణి సేన అనే బ్యాచ్ కి చెందిన ఆందోళనకారులు దాడి చేశారు.

    By Srikanya
    |

    ముంబై: ప్రముఖ సినీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై రాజ్‌పుత్‌కు చెందిన కర్ణిసేన కార్యకర్తలు దాడి చేసిన సంగతి మురవక ముందే ఇదే బ్యాచ్ మరో ఎటాక్ కు దిగారు.
    రాజస్థాన్‌లోని 13వ శతాబ్దానికి చెందిన చారిత్రక చిత్తోడ్‌గఢ్‌ కోటపై కర్ణి సేన అనే బ్యాచ్ కి చెందిన ఆందోళనకారులు దాడి చేశారు.

    కోటలోని రాణి పద్మిని మహల్‌లో ఉన్న అద్దాలను పగలగొట్టారు. కోటలోని అద్దాలు చరిత్రను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. వాటిని తొలగించాలని తాము అనేక సార్లు హెచ్చరించామని కర్ణి సేన బృందం తెలిపింది. కోట నిర్వాహకులు అద్దాలను తొలగించకపోవడంతో తాము దాడి చేసినట్లు పేర్కొంది.

    Karni Sena vandalises Chittorgarh Fort, breaks mirrors in the palace of Rani Padmini

    అప్పటి ముస్లిం పాలకుడు అల్లాఉద్దిన్‌ ఖిల్జీ ఈ అద్దాల్లోనే రాణి పద్మిని ముఖాన్ని చూశారని పర్యాటకులకు చెబుతుంటారు. అయితే రాణి ముఖాన్ని అల్లాఉద్దీన్‌ ఖిల్జీకి ఎప్పుడూ చూపించలేదని, అసలు ఆ కాలంలో ఇలాంటి అద్దాలే లేవని కర్ణి సేన వాదన.

    కాగా.. రాణి పద్మిని జీవిత కథ ఆధారంగా 'పద్మావతి' అనే సినిమా తెరకెక్కిస్తున్న బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీపై కూడా ఈ బృందం గతంలో దాడి చేసింది. బన్సాలీ అక్కడ సినిమా చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఆందోళనకారులు ఆయనపై దాడి చేశారు. మరో పక్క అసలు రాణి పద్మిని పాత్ర కేవలం కవిత్వంలో కన్పించే వూహాత్మక పాత్రే తప్ప చరిత్రలో ఆమె లేరని చరిత్రకారులు పేర్కొంటున్నారు. చరిత్రకు విరుద్ధంగా సినిమా తీస్తున్నారని, అతిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్ణి సేన కార్యకర్తలు చిత్రీకరణను అడ్డకుంటున్నారు. షూటింగ్ చేస్తున్న ప్రదేశం వద్ద గందరగోళం సృష్టిస్తున్నారు.

    'పద్మావతి' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సంగ్ నటిస్తున్నారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడినట్లు సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించినట్లు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.

    పద్మిణి రాణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని, పద్మిణి ఆత్మాభిమానం గల రాణి అని, చిట్టోర్‌గఢ్ కోటపై దాడి జరిగినపుడు ఆమె అల్లావుద్దీన్ కు లొంగిపోకుండా ఆత్మత్యాగం చేసిందని ఆందోళనకారులు వాదిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, 'పద్మావతి' సినిమాలో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్లు చూపిస్తే ఊరుకోబోమని ఆందోళన కారులు హెచ్చరించారు.

    English summary
    Members of the Shree Rajput Karni Sena flexed its muscle once again, vandalising mirrors in the palace of Rani Padmini in Chittorgarh Fort because “it hurt public sentiment.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X