twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎట్టకేలకు కార్తి ‘బ్యాడ్ బాయ్’ రిలీజ్ డేట్ ఖరారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యుగానికి ఒక్కడు, ఆవారా, నాపేరు శివ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కార్తీ. త్వరలో కార్తి 'బ్యాడ్ బాయ్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై అగ్ర నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా తమిళంలో 'అలెక్స్ పాండ్యన్'గా రూపొందించిన ఈ చిత్రం తెలుగులో 'బ్యాడ్‌బాయ్' పేరుతో అనువదించారు.

    ఈచిత్రం కార్తీ సరసన అనుష్క కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో అనుష్క కూడా పలు రిస్కీ యాక్షన్ దృశ్యాలలో డూప్ లేకుండా నటించింది. జనవరిలోనే ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈచిత్రాన్ని మార్చి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ సినిమా గురించి హీరో కార్తీ ఇటీవల మాట్లాడుతూ..'బ్యాడ్‌బాయ్ చిత్రాన్ని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చాలా భారీ ఎత్తున నిర్మించారు. దర్శకుడు సురాజ్‌ చాలా బాగా తీసారు. ఇందులో నా క్యారెక్టర్‌ చాలా భిన్నంగా వుంటుంది. అనుష్క క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్‌ వుంది. దేవిశ్రీప్రసాద్‌ సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. తెలుగులో నాకు 'బ్యాడ్‌బాయ్' మరో గుడ్‌ హిట్‌ మూవీ అవుతుంది' అని అన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌ అంతటా స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌ రాజాగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫొటోగ్రఫీ: ఎస్‌.శరవణన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, కో-ప్రొడ్యూసర్స్‌: ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎన్‌.ఆర్‌.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, దర్శకత్వం: సురాజ్‌.

    English summary
    Tamil Movie Alex Pandian releasing as 'Bad Boy' on March 9. Directed by Suraj. Starring Karthi, Anushka Shetty and Santhanam in Lead Roles. The film has music by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X