కార్తి ‘బ్యాడ్ బాయ్’ రిలీజ్ డేట్ మారింది
హైదరాబాద్: కార్తీ,అనుష్క కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బ్యాడ్ బాయ్'. మార్చి 9 న ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈచిత్రాన్ని మే 22 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై అగ్ర నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా తమిళంలో 'అలెక్స్ పాండ్యన్'గా రూపొందించిన ఈ చిత్రం తెలుగులో 'బ్యాడ్‌బాయ్' పేరుతో అనువదించారు.
యుగానికి ఒక్కడు, ఆవారా, నాపేరు శివ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కార్తీ. త్వరలో కార్తి 'బ్యాడ్ బాయ్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈచిత్రం కార్తీ సరసన అనుష్క హీరోయిన్ గానటించింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో అనుష్క కూడా పలు రిస్కీ యాక్షన్ దృశ్యాలలో డూప్ లేకుండా నటించింది.
ఈ సినిమా గురించి హీరో కార్తీ ఇటీవల మాట్లాడుతూ..'బ్యాడ్‌బాయ్ చిత్రాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా చాలా భారీ ఎత్తున నిర్మించారు. దర్శకుడు సురాజ్ చాలా బాగా తీసారు. ఇందులో నా క్యారెక్టర్ చాలా భిన్నంగా వుంటుంది. అనుష్క క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ వుంది. దేవిశ్రీప్రసాద్ సూపర్‌హిట్ మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో నాకు 'బ్యాడ్‌బాయ్' మరో గుడ్ హిట్ మూవీ అవుతుంది' అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఎస్.శరవణన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కో-ప్రొడ్యూసర్స్: ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎన్.ఆర్.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం: సురాజ్.


Click it and Unblock the Notifications











