twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లకు సరిపోయే స్టెప్ఫులు వద్దు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. అలాగని నేను బాగా చేస్తానని కూడా చెప్పను. నేను చేసే పాటకు నృత్య దర్శకుడు ఎవరైతే ఉంటారో ఆయనే నాకు గురువు. మంచి భంగిమలు చేద్దాం... అలాగని మరీ అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లకు సరిపోయే స్టెపులు వద్దని చెబుతుంటాను. వాళ్లిద్దరిలా చేయడం కష్టమే. 'బ్యాడ్‌బాయ్‌' చిత్రంలోని ప్రతి పాట కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలోని డాన్స్‌లు కోసం కష్టపడినా అవి బాగా వచ్చేసరికి ఆ బాధే లేదు.'' అంటున్నారు కార్తీ.

    'ఆవారా', 'నా పేరు శివ', 'యుగానికి ఒక్కడు' లాంటి చిత్రాలతో తెలుగులో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన నటించిన 'బ్యాడ్‌బాయ్‌' చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కార్తి హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు ఈ సందర్భంగా ముచ్చటించారు.

    ''శకుని తరవాత విరామం వచ్చిన మాట వాస్తవమే. సరైన సినిమాలు కుదరక ఆలస్యం అయింది. స్వతహాగా ఇంత విరామం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను చక్కగా ఆదరిస్తున్నారు. శకుని తర్వాత నా సినిమా రావడం ఆలస్యం అయినా 'బ్యాడ్‌బాయ్‌' ఆ లోటుని తీరుస్తుంది.'' అన్నారు.

    తెలుగులో సినిమా గురించి చెప్తూ....'పూర్తి స్థాయి తెలుగు సినిమా ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. అందుకు తగ్గ కథ కోసం ఎదురుచూస్తున్నాను. కొంతమంది దర్శకులు కథలు కూడా వినిపించారు. కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తెలుగు దర్శకులతో పని చేయాలని నాకు ఆత్రుతగానే ఉంది. కథ అవసరాన్ని బట్టి ప్రయోగాలు, సాహసాలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కష్టమైనా సాహసం చేయడమే నాకిష్టం.'' అన్నారు.

    English summary
    Kaarthi's latest film Birayani relesing on 22nd this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X