కార్తి ‘బిర్యానీ’ ఫస్ట్ లుక్ అదిరింది(ఫోటోలు)
తమిళ స్టార్ కార్తీ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆచిత్రం పేరు 'బిర్యానీ'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్. తమిళ నటుడు ప్రసన్న, నీతు చంద్ర, స్నేహ, రాంకీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ (తమిళ వెర్షన్) ఫోటోలు విడుదలయ్యాయి. తెలుగులో కూడా ఈచిత్రాన్ని అదే పేరుతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో కార్తి, హన్సిక లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉండటం చర్చనీయాంశం అయింది. గత సినిమాల కంటే కార్తీని దర్శకుడు వెంకట్ ప్రభు మరింత స్టైలిష్ గా చూపిస్తాడని ఈ పోస్టర్లు చూస్తే స్పష్టం అవుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలోకి ఒక కొత్త పాత్ర ఎంటర్ అవబోతుంది. కొత్త అంటే కొత్తవాల్లేమి కాదు, ఒకప్పుడు తమిల్ లో మంచి యాక్షన్ చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అప్పటి హీరో "రాంకీ".
ఈ మద్య సిని పరిశ్రమ కు దూరంగా వున్న రాంకీ ఇప్పుడు బిర్యానీ సినిమా తో మళ్ళి పరిశ్రమ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రాంకీ చేసిన తమిళ నుండి తెలుగుకు అనువదింపబడిన "సిందూరపువ్వు" సినిమాను ఎవరు మర్చిపోయి వుండరు, అంతలా గుర్తుండిపోయింది ఆ సినిమా. అందులో తన సహా నటి నిరోషా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాంకీ. ఇప్పుడు ఈ బిర్యానీ సినిమా లో రాంకీ ఒక కీలక పాత్ర చేయబోతున్నాడు. అది ఎం పాత్ర, ఎలా వుంటుంది అనేది తెరపైన చూడవలసిందే.

కార్తి బిర్యానీ ఫస్ట్ లుక్ ఫోటోలు.

కార్తి బిర్యానీ ఫస్ట్ లుక్ ఫోటోలు.

కార్తి బిర్యానీ ఫస్ట్ లుక్ ఫోటోలు.

కార్తి బిర్యానీ ఫస్ట్ లుక్ ఫోటోలు.

కార్తి బిర్యానీ ఫస్ట్ లుక్ ఫోటోలు.

కార్తి బిర్యానీ ఫస్ట్ లుక్ ఫోటోలు.
ఈ చిత్రంలో ఇంకా వైభవ్ రెడ్డి, సంపత్ రాజ్, ప్రేమ్ జి అమెరెన్, నితిన్ సత్యా, సామ్ ఆండ్రూ తదితరులు నటిస్తున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ శక్తి శరవణన్, ఎడిటింగ్: కె.ఎల్.ప్రవీణ్, ఎన్.బి. శ్రీకాంత్, సంస్థ: స్టూడియో గ్రీన్, నిర్మాత: జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం: వెంకట్ ప్రభు.


Click it and Unblock the Notifications











