ఖైదీ సీక్వెల్ వచ్చేస్తోంది.. మీ అందరూ గర్వపడేలా చేస్తా ఎమోషనల్ అయిన కార్తీ

యుగానొక్కడు చిత్రంతో అందర్నీ పలకరించిన కార్తీ అటుపై ఆవారా చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక వరుస తమిళ డబ్బింగ్ చిత్రాలతో పలకరిస్తూ వస్తోన్న కార్తీ మధ్యలో కాస్త వెనుకబడిపోయాడు. చివరగా చినబాబు, దేవ్ చిత్రాలతో పలకరించినా ఆశించిన గుర్తింపును మాత్రం తెచ్చుకోలేకపోయాడు. తాజాగా రూటు మార్చి ఖైదీ అంటూ ఓ విభిన్న ప్రయోగం చేస్తూ ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం అందర్నీ మెప్పిండంతో కార్తీ ఆనందలో మునిగిపోయాడు.

విజిల్‌కు పోటీగా దిగిన ఖైదీ

విజిల్‌కు పోటీగా దిగిన ఖైదీ

తమిళ నాట దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. అయితే విజయ్ బిగిల్ (తెలుగులో విజిల్)కు పోటిగా తన సినిమాను దించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బిగిల్‌ మాస్ ఎంటర్టైన్‌గా మెప్పించగా.. ఖైదీ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ఈ రెండు సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అయ్యాయి.

 తెలుగులో ఖైదీ హవా..

తెలుగులో ఖైదీ హవా..

ఇంత వరకెన్నడూ లేని విధంగా రెండు డబ్బింగ్ చిత్రాలకు భారీ ఎత్తున్న థియేటర్లను కేటాయించారు. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ రెండు చిత్రాలను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. మొదటి రోజు భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రాలు.. రాను రాను కాస్త చల్లబడ్డాయి. అయితే ఖైదీ మాత్రం విజయ్ నటించిన విజిల్ కంటే ఎక్కువ స్ట్రాంగ్‌గా నిలబడి వసూళ్లను సాధించడం విశేషం.

ఖైదీని ప్రశంసించిన మహేష్

ఖైదీని ప్రశంసించిన మహేష్

ఈ మధ్య కాలంలో మంచి సినిమాను ప్రోత్సహిస్తోన్న హీరోల్లో మహేష్ బాబు ముందుంటున్నాడు. చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా ఏ మంచి సినిమా వచ్చిన చూసి అభినందనలు తెలియజేస్తున్నాడు. తాజాగా ఖైదీని వీక్షించిన మహేష్ బాబు.. చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పాటలు లేకుండా సినిమా తీయడం ఆహ్వానించదగ్గ విషయమని కొనియాడాడు.

ధన్యవాదాలు తెలిపిన నిర్మాత, హీరో

మహేష్ బాబు ఖైదీని ప్రశంసలతో ముంచెత్తండంతో ఖైదీ చిత్రయూనిట్ ఆనందంలో మునిగింది. చిత్ర నిర్మాత ఎస్ ఆర్ ప్రభు మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమా పట్ల మీకున్న ప్రేమకు, మా చిత్రంపై మీరు కురిపించిన ప్రశంసలకు ధన్యవాదాలు అంటూ కార్తీ ట్వీట్ చేశాడు.

సీక్వెల్ రానుంది...

సీక్వెల్ రానుంది...

ఖైదీ సినిమా ఇంత అభిమానాన్ని, ప్రేమను చూపించినందుకు థ్యాంక్స్ అని అంటూ.. నా జీవితంలో నేను చవిచూసిన ఎత్తుపల్లాల్లో నా వెంటే ఉన్నా సోదర సోదరీమణులందరూ గర్వపడేలా నేను కష్టపడి పని చేస్తూనే ఉంటాను మీ కోసం ఢిల్లీ మళ్లీ వస్తాడు అంటూ సీక్వెల్స్‌పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X