అక్కగా మారిన వదిన.. ఆకట్టుకున్న దొంగ.. మెగాస్టార్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా..?

ఈ ఏడాది దేవ్‌గా వచ్చిన కార్తీ నిరాశను మిగల్చగా.. మరో బ్లాక్ బస్టర్‌తో ఆ లెక్కను సరిచేశాడు. ఖైదీగా తిరుగులేని హిట్ కొట్టాడుకార్తీ. అయితే మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ సారి తన వదినతో కలిసి హిట్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. దొంగ అనే టైటిల్‌తో నిన్న రిలీజ్ చేసిన పోస్టర్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

 కెరీర్‌లో ఫస్ట్ టైమ్..

కెరీర్‌లో ఫస్ట్ టైమ్..

ఈ ఏడాది దేవ్ సినిమాతో పలకరించిన కార్తీకి నిరాశ మిగలగా.. ఖైదీతో ఆనందం రెట్టింపైంది. కొత్తగా ట్రై చేసిన కార్తీకి భారీ హిట్ వచ్చింది. కమర్షియల్ హంగులకు పోకుండా కథను నమ్ముకునే సినిమాను తీయడం ఖైదీకి కలిసివచ్చింది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ వందకోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి రికార్డు సృష్టించాడు.

జోరుమీదున్న జ్యోతిక కెరీర్..

జోరుమీదున్న జ్యోతిక కెరీర్..

ఓ వైపు తమ్ముడి కెరీర్ జోరుగా సాగుతూ ఉండగా.. మరో వైపు భార్య జ్యోతిక కెరీర్ కూడా గాడిలో పడింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటించి మెప్పిస్తోంది. ఝాన్సీ, జాక్‌పాట్ లాంటి సినిమాలతో మంచి ఫామ్‌లోకి వచ్చింది. రీసెంట్‌గా రాక్షసితో పలకరించగా.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

వీరిద్దరు కలిసి రావడంతో..

వీరిద్దరు కలిసి రావడంతో..

మంచి సక్సెస్‌లో కార్తీ, జ్యోతిక కలిసి నటించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సత్యరాజ్ లాంటి వినూత్న నటుడు కూడా వీరికి తోడు కావడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఖైదీని మరిచిపోక ముందు దొంగ అంటూ మరోసారి మెస్మరైజ్ చేసేందుకు సిద్దమయ్యాడు.

అక్కా, తమ్ముడు సెంటిమెంట్..

రియల్ లైఫ్‌లో వదినగా ఉన్న జ్యోతిగా రీల్ లైఫ్‌లో అక్కగా మారింది. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలోనూ పలు విభిన్న రకాలుగా నటించినట్టు కనిపిస్తోంది. ఈ టీజర్‌ను తెలుగులో నాగార్జున, తమిళంలో మోహన్ లాల్ విడుదల చేశారు.

Recommended Video

#CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
సెంటిమెంట్ కలిసి వచ్చేనా..?

సెంటిమెంట్ కలిసి వచ్చేనా..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం ఖైదీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలుండవు. ఇలాంటి పవర్‌ఫుల్ టైటిల్‌ను కార్తీ వాడుకుని అదిరిపోయే హిట్ కొట్టాడు. మరోసారి చిరు టైటిల్‌ను వాడబోతోన్నాడు. మరి ఈసారి కూడా విజయం సాధిస్తాడా అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X