కాజల్, కార్తీల రొమాంటిక్ మూవీ ‘నా పేరు శివ’..!
కార్తీ, కాజల్ అగర్వాల్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'నాన్ మహాన్ అల్ల" తెలుగులో 'నా పేరు శివ" పేరిట విడుదల కానుంది. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని కెఇ జ్ఞానవేల్‌రాజా తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో సీడీని కార్తీ ఆవిష్కరించి వెన్నెలకంటికి ఇచ్చారు. మధుర ఆడియో ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ 'తెలుగులో విడుదలైన నా గత రెండు చిత్రాలు 'యుగానికి ఒక్కడు", 'ఆవారా" ఘనవిజయం సాధించాయి. నా నుంచి వస్తోన్న ఈ మూడవ చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా ఒక జీవితంలా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల్లో అన్నీ తక్కువగా ఉంటాయి. ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. ఈ చిత్రంలో నేను మధ్యతరగతి యువకుడిగా నటించాను. సినిమా ప్రథమార్ధం రొమాంటిక్ గా ద్వితీయార్ధం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది.
త్వరలోనే పెళ్లికొడుకాబోతున్న కార్తీ వివాహం జూలై మూడున రంజనితో జరుగుతోంది. తమిళనాడులోని కోయంబత్తూర్ లో వీరి వివాహం ఆ రోజున వైభవంగా జరుగనుంది. అనంతరం జూలై 7 న చెన్నయ్ లో వివాహ రిసెప్షన్ ను గ్రేండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు చిత్ర సీమకు చెందిన దర్శక నిర్మాతలను, తారలను తన వివాహానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. తర్వాత నాపేరు శివ ఆడియో తర్వాత కూడా పలువురు ప్రముఖులను స్వయంగా కలుస్తూ శుభలేఖలు పంచుతున్నాడు. ప్రముఖ నటుడు సూర్యాకు కార్తీ తమ్ముడన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











