Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కార్తి-కాజల్ కాంబినేషన్లో మరో సినిమా!
హైదరాబాద్ : తమిళ హీరో కార్తి, హీరోయిన్ కాజల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. గతంలో వీరు 'నాన్ మహాన్ అల్లా' అనే తమిళ చిత్రంలో కలిసి నటించారు. ఇదే చిత్రం తెలుగులో 'నా పేరు శివ'గా అనువదించారు. తాజా ఈ ఇద్దరు'ఆల్ ఇన్ ఆల్ అజాఘు రాజా' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.
ఎం రాజేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆల్ ఇన్ ఆల్ అజాఘు రాజా' చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళనాడులోని పొల్లాచ్చి, టెంకాసి తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సంతానం కామెడీ ఈచిత్రానికి హైలెట్ కానుంది. దీన్ని కూడా తెలుగులో అనువదించనున్నారు.
ఇక కార్తి తమిళంలో నటించిన అలెక్స్ ప్యాండ్యన్ చిత్రం తెలుగులో బ్యాడ్ బాయ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈచిత్రానికి సురాజ్ దర్శకత్వం వహించగా స్టూడియో గ్రీన్ పతాకంపై అగ్ర నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రం కార్తీ సరసన అనుష్క కథానాయికగా నటించింది.
జనవరిలోనే ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈచిత్రాన్ని మార్చి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఎస్.శరవణన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కో-ప్రొడ్యూసర్స్: ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎన్.ఆర్.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం: సురాజ్.