కదిలించే క్రేమ్ ధ్రిల్లర్ (కార్తి నా పేరు శివ ప్రివ్యూ)

By Srikanya

తెలుగులోనూ తనకంటూ మార్క్,మార్కెట్ క్రియేట్ చేసుకున్న కార్తి తాజా చిత్రం నా పేరు శివ. నాన్ మహాన్ అల్లా పేరట తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో ఈ రోజు విడుదల అవుతోంది. తెలుగులో దాదాపు నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్న కాజల్ హీరోయిన్ గా చేయటం ఈ చిత్రం క్రేజ్ కి మరో కారణం. ఇక చిత్రంలో శివ (కార్తి) ఆడుతూపాడుతూ సరదాగా జీవితాన్ని గడిపేసే కుర్రాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. అనుకోని రీతిలో అతనికి ప్రియ (కాజల్‌) పరిచయమవుతుంది. ఆమె తండ్రి న్యాయవాది. ఆ తరవాత జరిగిన కొన్ని సంఘటనలు శివ, ప్రియల జీవితాల్ని మార్చేస్తాయి. ఆ సంఘటనలేమిటన్నది తెర మీదే చూడాలి.

అవారా,యుగానికొక్కడు వంటి చిత్రాలతో తెలుగులో స్టార్ అనిపించుకున్న కార్తి ఈ చిత్రంపై మంచి ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆవార,యుగానికొక్కడు చిత్రాలు తమిళంలో కన్నా తెలుగులోనే బాగా ఆడాయి. ఆ నమ్మకంతోనే కార్తి ఇక్కడికి స్వయంగా వచ్చి ప్రమోషన్ చేసి మరీ ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. ఆయన సొంత బ్యానర్ స్టూడియో గ్రీన్ సంస్ధపైనే ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి నిర్మాత చిత్రం గురించి చెబుతూ ''కార్తి పోషించిన పాత్ర ప్రేక్షకులకు చేరువైనదే. మనింట్లో కుర్రాడిలా అనిపిస్తాడు. సంగీతం ప్రధాన బలం. అలాగే ఈ కథలో విలన్స్ ఎవరు అనేది చిత్రంలో చూడాల్సిందే'' అన్నారు.

సంస్థ: స్టూడియో గ్రీన్‌
నటీనటులు: కార్తి, కాజల్‌, జె.పి, సూరి, రవిప్రకాష్‌, లక్ష్మిరామకృష్ణన్‌ తదితరులు.
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా
దర్శకత్వం: సుశీంద్రన్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X