హన్సిక ‘బిర్యాని' ఎప్పుడెప్పుడు వడ్డన తేదీ ఫిక్స్
హైదరాబాద్: హన్సిక, కార్తీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బిర్యాని'. ఈ చిత్రం సెప్టెంబర్ 6 న విడుదల కానుంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో హన్సిక జర్నలిస్ట్ గా కనిపించనుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించి స్టిల్స్ విడుదల చేసారు. అవి అభిమానులను ఓ రేంజిలో ఆకర్షిస్తున్నాయి.
హన్సిక మాట్లాడుతూ.... ''నా అదృష్టం కొద్దీ రానున్న అన్నీ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తున్నాను. నాకు జర్నలిస్ట్ వృత్తి అంటే చాలా గౌరవం. ఒక్క సినిమాలోనైనా జర్నలిస్ట్‌గా కనిపించాలనేది నా ఆశ. త్వరలో ఆ కోరిక కూడా తీరబోతోంది. కార్తీ 'బిర్యాని' చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే 'ది బెస్ట్' అనదగ్గ కేరక్టర్ అది'' అంది.
ఇక ఈ చిత్రంపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ బాగానే మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగులో కార్తీకి ఉన్న బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారికి నచ్చే ఎలిమెంట్స్ కలిపి మరీ నిర్మించారని చెప్తున్నారు. శకుని,బ్యాడ్ బోయ్ చిత్రాలు నిరాశ పరిచిన నేపధ్యంలో ఈ చిత్రం కార్తీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












