twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తీ ‘బిర్యాని' రిలీజ్ డేట్ ఖరారు

    By Srikanya
    |

    Karthi’s Biryani to be served on 20th Dec
    హైదరాబాద్: హన్సిక, కార్తీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బిర్యాని'. ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ సడెన్ గా ప్లాన్ మార్చి ముందే వచ్సేస్తోంది. సంక్రాంతి కి థియోటర్స్ ఇబ్బంది,పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాకు సమస్య ఎదురుతుందనే ఆలోచనలతో ఈ సినిమాని ముందుగా తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హన్సిక జర్నలిస్ట్ గా కనిపించనుంది.

    హన్సిక మాట్లాడుతూ.... ''నా అదృష్టం కొద్దీ రానున్న అన్నీ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తున్నాను. నాకు జర్నలిస్ట్ వృత్తి అంటే చాలా గౌరవం. ఒక్క సినిమాలోనైనా జర్నలిస్ట్‌గా కనిపించాలనేది నా ఆశ. త్వరలో ఆ కోరిక కూడా తీరబోతోంది. కార్తీ 'బిర్యాని' చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే 'ది బెస్ట్' అనదగ్గ కేరక్టర్ అది'' అంది.

    ఇక ఈ చిత్రంపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ బాగానే మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగులో కార్తీకి ఉన్న బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారికి నచ్చే ఎలిమెంట్స్ కలిపి మరీ నిర్మించారని చెప్తున్నారు. శకుని,బ్యాడ్ బోయ్ చిత్రాలు నిరాశ పరిచిన నేపధ్యంలో ఈ చిత్రం కార్తీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు.

    English summary
    Karthi starrer Biryani is a bilingual and has Hansika Motwani as its leading lady. Sources inform us that both the Telugu and Tamil version of this film will be released on the 20th December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X