twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తి ‘దేవ్’ టీజర్ అదిరిపోయింది, రకుల్ ప్రీత్ హాట్ లుక్!

    |

    తమిళ స్టార్ కార్తీ త్వరలో 'దేవ్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రజత్ రవిశంకర్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందుతోంది. తాజాగా 'దేవ్' టీజర్ విడుదల చేశారు. ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.

    ముఖ్యంగా టీజర్లో చెప్పిన డైలాగులు.... ఈ కాలం యువత ఎదుర్కొంటున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. 'ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఎవరో చెప్పారని అర్ధంకాని చదువు చదివి, ఇష్టం లేని ఉద్యోగం చేసి, ముక్కూ మొహం తెలియని ఓ నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పని చేసి, ఇగో, ప్రెషన్ కాంపిటీషన్లో ఇరుక్కుని, అంటీ అంటనట్లు లవ్ చేసి ఏం జరుగుతుందో అర్థం కాకుండా బ్రతకడం ఓ దారి.....ఇంకో దారి ఉంది.'' అంటూ కార్తి చెప్పే డైలాగ్స్ బట్టి అతడి క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవచ్చు.

    ఈ చిత్రంలో కార్తి బైక్ రేసర్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, విజె విఘ్నేష్, అమృత శ్రీనివాసన్ నటిస్తున్నారు. నటుడు కార్తీ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

    ముఖ్యంగా కార్తి, రకుల్ ప్రీత్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. గతంలో ఈ ఇద్దరూ 'ఖాకీ' అనే చిత్రంలో కటిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా 'దేవ్' ద్వారా మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు.

    Karthis Dev Official Teaser Released

    ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 2018న దీన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ రిలయన్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

    English summary
    Karthi's Dev Telugu Official Teaser Released. Directed by Rajath Ravishankar & Music Composed by Harris Jayaraj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X