twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తి 'కాష్మోరా' ఫస్ట్ డే టాక్, కథ, సినిమా హైలెట్స్ ( ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగువారిని యుగానికి ఒక్కడు, నాపేరు శివ, ఊపిరి వంటి సినిమాలతో ఆకట్టుకున్న కార్తీ, ప్రస్తుతం 'కాష్మోరా' అనే సినిమా తో ఈ రోజు ధియోటర్స్ లోకి వస్తున్నాడు. డార్క్ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ మూడు పాత్రలు పోషిస్తున్నాడు. రాజ్య సైనికాధికారీ రాజ్ నాయక్, నేటితరం యువకుడు, రహస్యాన్ని చేధించే పాత్ర ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించే కార్తి సినిమా ఇప్పటికే విదేశాల్లో షోలు పడిపోయాయి. చిత్రం టాక్, కథ, ఆ తర్వాత హైలెట్స్ చూద్దాం.

    బాహుబలి పుణ్యమా అని ...బాలీవుడ్ ని మించిపోయి భారీ సినిమాలు తీసేస్తున్నారు సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్స్. మగధీర.. ఈగ.. బాహుబలి.. కంచె.. రోబో లాంటి సినిమాలు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. ఈ కోవలోకి చేరేలా కనిపిస్తోంది 'కాష్మోరా'. ట్రైలర్ చూస్తే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ శుక్రవారమే 'కాష్మోరా' ప్రేక్షకుల ముందుకొస్తోంది.

    గత కొంతకాలంగా హీరో కార్తి పండుగ సీజన్లనే టార్గెట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'కాష్మోరా' సినిమా దీపావళి కానుకగా విడుదల కావటంతో ఓ రేంజిలోక్రేజ్ వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్‌, ఫొటోలు 'బాహుబలి' మాదిరిగా కనిపిస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

     ఆత్మను బంధించి

    ఆత్మను బంధించి

    ఈ సినిమా దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి ఫ్లాష్ బ్యాతో ఇంట్రస్టింగ్ గా ప్రారంభమైంది. అరుంధతి తరహాలో ఓ శాపంతో ఓ ఆత్మ బంధీ అయిపోతుంది. ఈ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , ధీమ్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి.

     ఈ కాలంలో కార్తి..దెయ్యాలను

    ఈ కాలంలో కార్తి..దెయ్యాలను

    జనాలకు ఉన్న దెయ్యాలు, మంత్రాల వాటిపై ఉన్న నమ్మకాలపై ఆడుకుంటూ డబ్బు సంపాదిస్తూంటాడు కార్తి. దెయ్యాలను పట్టుకుంటూంటాడు. అతని పేరే కాశ్మోరా. దెయ్యాలను పట్టుకునేవాడిగా మంచి పాపులారిటీ వస్తుంది. ఆ తర్వాత పాట స్టార్ట్ అవుతుంది.

     శ్రీదివ్య వస్తుంది ఇక

    శ్రీదివ్య వస్తుంది ఇక


    హీరో ఎంట్రీ అయ్యిపోయింది కదా..ఇక హీరోయిన్ శ్రీదివ్య వస్తుంది. ఆమె పేరు యామిని. ఆమె దెయ్యాలపై రీసెర్చ్ చేస్తూంటుంది. దాంతో దెయ్యాలతో ఎప్పుడూ టచ్ లో ఉండే కాశ్మరా తో టచ్ లో ఉండాలని ప్రయత్నిస్తూంటుంది.

     హీరోయిన్ ట్విస్ట్

    హీరోయిన్ ట్విస్ట్


    అయితే అసలు హీరోయిన్ శ్రీదివ్య ..మన హీరో దగ్గరకు చేరటానికి కారణం ...దెయ్యాలపై రీసెర్చ్ కాదు. అతను ఫ్రాడ్ అని, అందరి ఎదురుగా అతని ప్రాడ్ అని ప్రూవ్ చేసి , జనంకు పట్టివ్వాలని అలా తిరుగుతూంటుంది. అది ఆమె సీక్రెటి మిషన్

     విలన్ ..కార్తీని పిలుస్తాడు

    విలన్ ..కార్తీని పిలుస్తాడు

    అయితే ఇంతపాపులారిటి వచ్చిన కాశ్మోరాకు ఓ ఆఫర్ వస్తుంది అది విలన్ నుంచి. తన ఇంట్లో ఉన్న దెయ్యాల ని తరిమివేయమని, తన ఇంట్లో వింత సంఘటనలు జరుగుతున్నాయని కార్తిని సాయిం అడుగుతారు. ఎప్పటిలాగే కార్తి బయిలుదేరతాడు. అలా విలన్ తో పరిచయం జరుగుతుంది.

     హీరో ఇంట్లో విలన్ డబ్బు

    హీరో ఇంట్లో విలన్ డబ్బు


    మరో ప్రక్క విలన్ కు హీరోకు బాగా ప్రెండ్షిప్ అవుతుంది. విలన్ ...తన ఇంటిపై ఐటి రైడ్స్ జరుగుతున్నాయని ..హీరో ఇంట్లో తను అక్రమంగా సంపాదించిన 500 కోట్లు దాస్తాడు. కానీ హీరో తండ్రి వాటిని పట్టుకుని జంప్ అయ్యిపోతాడు.

     నిజంగానే దెయ్యాలు

    నిజంగానే దెయ్యాలు


    అదే సమయంలో హీరో..విలన్ చెప్పే ఆ దెయ్యాలున్నాయనే ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఎప్పటిలాగే కార్తీ అక్కడ దెయ్యాలు ఏమీ లేవు అనుకుని తన పద్దతిలో తను వాటిని తరుముతున్నట్లు నాటకమాడతాడు. కానీ నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నాయి. ఈ సీన్స్ మంచి కామెడీ పండాయి

     కార్తి 'కాష్మోరా' ఫస్ట్ డే టాక్, కథ, సినిమా హైలెట్స్ ( ప్రివ్యూ)

    కార్తి 'కాష్మోరా' ఫస్ట్ డే టాక్, కథ, సినిమా హైలెట్స్ ( ప్రివ్యూ)

    విలన్స్ కార్తీ ఇంట్లో పెట్టిన డబ్బు మిస్సవటంతో ఎటాక్ చేస్తారు. కానీ అదే సమయంలో కార్తీలోకి ఆ భవంతిలో ఉన్న ఆత్మ ప్రవేశించి, ఆ విలన్స్ ని చితక్కొడుతుంది. కార్తీ తండ్రి కూడా అక్కడే కనపడతాడు. అక్కడ నుంచి ఏం జరిగింది. విలన్స్ ..హీరోని వదిలారా..అసలు కార్తిలో ప్రవేసించిన ఆత్మ ఏమిటి అనే విశాషలతో కథ నడుస్తుంది.

     మిగతా కథేంటి?

    మిగతా కథేంటి?

    500 ఏళ్ల క్రితం నాటి రాజ్‌ నాయక్‌ (కార్తి)కీ, ఇప్పటి కాష్మోరా (కార్తి)కీ ఉన్న సంబంధం ఏమిటన్నదే కీలకం. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రత్నమహాదేవి (నయనతార) పాత్ర కీలకం. యామిని (శ్రీదివ్య) ఓ రీసెర్చ్‌ స్కాలర్‌ పాత్రలో కనిపించనుంది. వీళ్లమధ్య నడిచే సన్నివేశాలు ఆసక్తికరం

     విజువల్ ఎఫెక్ట్స్ కే అంత ఖర్చు

    విజువల్ ఎఫెక్ట్స్ కే అంత ఖర్చు

    2015 మేలో చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. కార్తి కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్‌ చిత్రం. దాదాపు రూ.15 కోట్లు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం ఖర్చు చేశారు. ఈ సినిమా కోసం 19 సెట్లను కళా దర్శకుడు రాజీవన్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

     నమ్ముతారా గ్రాఫిక్స్ అంత ఎక్కువగా

    నమ్ముతారా గ్రాఫిక్స్ అంత ఎక్కువగా

    ఈ సినిమాలో కార్తి మూడు గెటప్పుల్లో కనిపిస్తున్నారు. షూటింగ్‌ అంతా చెన్నైలోనే జరిగింది. దాదాపు 90 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి. అందుకోసం 25 గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కంపెనీలు రెండు నెలల పాటు కష్టపడ్డాయి. దాదాపు 1800 విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌ ఉండబోతున్నాయి. కార్తి పోషించిన రాజ్‌ నాయక్‌ పాత్ర కోసం త్రీడీ ఫేస్‌ స్కాన్‌ అనే టెక్నాలజీని ఉపయోగించారు.

    వడివేలు రీ ఎంట్రీ

    వడివేలు రీ ఎంట్రీ

    చాలాకాలం తరవాత హాస్యనటుడు వడివేలు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2వేల థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో 600 స్క్రీన్లు కేటాయించారు.
     ఇంత ఎప్పుడూ కష్టపడలేదు

    ఇంత ఎప్పుడూ కష్టపడలేదు

    ఓ సినిమా కోసం నేనెప్పుడూ ఇంత కష్టపడలేదు. నేనే కాదు... చిత్రబృందం అంతా అహర్నిశలూ శ్రమించింది. ఓ పాత్ర కోసం గుండు కొట్టించుకొన్నా. నిజానికి దర్శకుడు గోకుల్‌ మేకప్‌తో కవర్‌ చేద్దామన్నారు. కానీ... అదంత సహజంగా ఉండదు అనిపించింది. అందుకే గుండుకొట్టించుకోవడానికి ధైర్యం చేశా అంటున్నారు కార్తి.

     ఐదు గంటలు పట్టేది

    ఐదు గంటలు పట్టేది


    గుర్రపుస్వారీ కూడా నేర్చుకొన్నా. ప్రతీరోజూ మేకప్‌ కోసమే ఐదు గంటలు వెచ్చించాల్సివచ్చింది. రాజ్‌ నాయక్‌, కాష్మోరా పాత్రలు చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రెండు పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడానికి బాడీ లాంగ్వేజ్‌లో వైవిధ్యం చూపించా. డబ్బింగ్‌ కూడా నేనే స్వయంగా చెప్పుకొన్నా.

    చాలా జాగ్రత్తలు తీసుకున్నాం

    చాలా జాగ్రత్తలు తీసుకున్నాం

    రాజ్‌ నాయక్‌ కాస్ట్యూమ్స్‌ కూడా విచిత్రంగా ఉంటాయి. 12 రకాల కాస్ట్యూమ్స్‌ని పరిశీలించి చివరికి ఒకటి ఎంచుకొన్నాం. యుద్ధ సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. మొత్తానికి ‘కాష్మోరా' అనేది నా జీవితంలో ఓ మైలురాయి. మరో పది సినిమాల తరవాత చేయాల్సిన కథ ఇది. నా అదృష్టం కొద్దీ కాస్త ముందుగానే చేసేస్తున్నా'' అన్నారు కార్తి

     అరుంధతి, మగధీర, బాహుబలి లాగ

    అరుంధతి, మగధీర, బాహుబలి లాగ

    ఈ సినిమా కోసం దర్శకుడు గోకుల్‌ చాలా పరిశోధన చేశారు. ప్రీ ప్రొడక్షన్‌ కోసమే దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. కార్తి లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన వల్లే అనుకొన్న సమయంలో పూర్తి చేయగలిగాం. అరుంధతి, మగధీర, బాహుబలి... ఇలాంటి విజువల్‌ వండర్స్‌ జాబితాలో కచ్చితంగా ‘కాష్మోరా' చేరుతుంది అంటున్నారు నిర్మాత.

     అన్నీ ఉన్న హర్రర్

    అన్నీ ఉన్న హర్రర్

    కాష్మోరా అనగానే దీన్ని హారర్‌ సినిమా అనుకోవొద్దు. ఫాంటసీ, చారిత్రక నేపథ్యం, సందేశం, వినోదం... ఇవన్నీ కలగలిపిన సినిమా ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ఇంటిల్లిపాదికీ నచ్చుతుంది అని నిర్మాత చెప్పుకొచ్చారు.

     భయం వేస్తోంది

    భయం వేస్తోంది


    కార్తి మాట్లాడుతూ.. ''ఈ సినిమాని బాహుబలితో పోలుస్తుంటే భయం వేస్తోంది. ఇవి రెండూ వేర్వేరు సినిమాలు. బాహుబలికి ముందే 'కాష్మోరా'కి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉండాలో ఓ ప్రణాళిక రూపొందించాం. కానీ బాహుబలి చూశాక.. 'ఇంకాస్త సమయం తీసుకొని, ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దితే బాగుంటుంది' అనిపించింది.

     మగధీర టైప్ లో

    మగధీర టైప్ లో

    దాదాపు 25 కంపెనీల సహకారంతో అత్యున్నత సాంకేతికతతో ఆ ఎఫెక్ట్స్‌ని రూపొందించాం. 'మగధీర' తరహాలో సాగే చారిత్రక నేపథ్యమున్న ఘట్టాలుంటాయి. ఆ ఎపిసోడ్స్‌లోనే రాజ్‌నాయక్‌, కాష్మోరా పాత్రల్లో కనిపిస్తా. మేకప్‌ కోసం ఐదారు గంటలు పట్టేది. ఈ సినిమా కోసమే గుర్రపుస్వారి నేర్చుకున్నా. ఈ సినిమాలో మరో వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తా. ఆ పాత్ర పోషించేప్పుడు నాకు కమల్‌హాసన్‌ గుర్తుకొచ్చారు. పతాక సన్నివేశాలు వూహకు అందని రీతిలో సాగుతాయి.నా జీవితంలోనే మరచిపోలేని సినిమా. చెన్నైలో పన్నెండు భారీ సెట్లు వేశాం. దర్బార్‌ సెట్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది''అన్నారు కార్తి.

     డైరక్టర్ ఏమంటాడంటే...

    డైరక్టర్ ఏమంటాడంటే...


    దర్శకుడు మాట్లాడుతూ ''రెండున్నరేళ్ల నుంచి ఈ సినిమాపైనే దృష్టిపెట్టి పనిచేశాం'' అన్నారు. కార్తీకి 'వూపిరి' తర్వాత మరో విభిన్నమైన చిత్రమవుతుంది. తెలుగులో ఆదరణ పొందిన పేరు 'కాష్మోరా'. మా అందరి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని నమ్ముతున్నా'' అన్నారు.

     టీమ్ అంతా ఇదే..

    టీమ్ అంతా ఇదే..


    బ్యానర్: డ్రీమ్‌ వారియర్స్‌
    నటీనటులు: కార్తి, నయనతార, శ్రీదివ్య, మనీషా యాదవ్‌, వివేక్‌, సిద్ధార్థ్‌ విపిన్‌, మధుమిత, వడివేలు తదితరులు
    సంగీతం: సంతోష్‌ నారాయణ్‌,
    సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌
    ఆర్ట్‌: రాజీవన్‌,
    ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌,
    డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌,
    కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌,
    ఫైట్స్‌: అన్‌బారివ్‌,
    ప్రోస్తెటిక్స్‌: రోషన్‌,
    విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె,
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్
    విడుదల తేదీ: శుక్రవారం, (28-10-2016)
    నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, ప్రసాద్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
    నిడివి: 2 గంటల 38 నిమిషాలు

    English summary
    Kaashmora the most awaited film of this year is releasing on this friday i.e on 28 October 2016 acorss world wide. Kaashmora means Deadly Spirit in english and this is complete dark fantasy film. The film written and directed by Gokul and produced by S R Prakashbabu under Dream Warrior Pictures banner. Karthi, Nayantara, Sri Divya, Vivek are the main lead actors in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X