For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కార్తీ కాష్మోరా తెలుగులో కూడా దుమ్ము రేపేలా ఉన్నాడు.... అక్టోబర్ లో ఆడియో అట

  |

  ఇటీవలే ఊపిరి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో కార్తీ ప్రస్తుతం రౌద్రం ఫేం గోకుల్ దర్శకత్వంలో 'కాష్మోరా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. కార్తీ సరసన ఈ చిత్రంలో నయనతార శ్రీదివ్య లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ పునమల్లె హైవే దగ్గర వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.

  షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కూడా చాలానే ఉందట.ఈ చిత్రానికి సంబందించిన 15 నిమిషాల షూటింగ్ ని 3D ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ ని వాడి చిత్రికరించానున్నారట. కార్తీ పుట్టిన రోజు సందర్బంగా ఈ నెల 25న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారట మేకర్స్. అలాగే మగధీర, ఈగ, బాహుబలి చిత్రాలకు గ్రాఫిక్స్ అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తోంది.ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...

   Karthi's Kaashmora Trailer & Audio Launch on 7th October

  నిర్మాతలు మాట్లాడుతూ - ''కాష్మోరా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కార్తీ డిఫరెంట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ను అక్టోబర్ 7న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం. అన్ని విధాలుగా ఓ డిఫరెంట్‌ చిత్రంగా రూపొందుతున్న 'కాష్మోరా' తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు.

  హీరో కార్తీ మాట్లాడుతూ - ''కాష్మోరాలో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ కు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా వైవిధ్యమైన సినిమా. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది'' అన్నారు.

  కాష్మోరా చిత్ర దర్శకుడు గోకుల్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ చిత్రం కార్తీకు మంచి పేరు తెస్తోందని యూనిట్ భావిస్తోండగా, అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గత ఏడాది మే నెలలో ఆరంభమైనప్పటీకి కొన్ని కారణాల వల్ల ఆగింది. కార్తి తెలుగులో ఊపిరి సినిమాలో నటించటం వల్ల కూడా కాస్త ఆలస్యం అయ్యింది. ఇందులో కార్తి ముడు భిన్నమైన పాత్రలు చేస్తున్నారు.

   Kaashmora

  ఇందుకు కోసం కార్తికు ప్రత్యేకించి మేకప్ కోసం మూడు గంటల సమయం పడుతోందట. ఈ సినిమా కోసం తాజాగా 15 బ్రహ్మండమైన సెట్ లను వేసినట్లు టాక్. కార్తి ఇదివరకు నటించిన సినిమాల కంటే భారీ బడ్జెట్ తో కాష్మోరా రూపొందిస్తున్నట్ల సమాచారం. ఇంతకీ ఆ బడ్జెట్ ఎంతో తెలుసా..? సూమారు రూ.60 కోట్ల వరకూ ఉందట. కార్తీకి మంచి మార్కెట్టే ఉన్నా అంత బడ్జెట్ ని వెనక్కి తెప్పించటం అంటే మాటలు కాదు. కానీ కథలో ఉన్న బలం తోడైతే కార్తీ భారీ హిట్ కొట్తగలడనే నమ్మకం తో ఉందట కాష్మోరా యూనిట్.

  కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌, కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్‌: రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌. ​

  English summary
  The production house PVP Cinema made an announcement about the "Kaashmora" teaser and audio launch event. Both teaser and audio will be unveiled on 7th October.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X