కార్తి ‘శకుని’ ఆడియో రిలీజ్ ఖరారు
యుగానికొక్కడు, ఆవారా, నాపేరు శివ చిత్రాల ద్వారా తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ హీరో కార్తి త్వరలో 'శకుని'గా రాబోతున్నాడు. ఈచిత్రం ఆడియో మే 2వ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రం ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రణీత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ తాజాగా కార్తితోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బెల్లంకొండ సురేష్ తెలులుగులో విడుదల చేయబోతున్నారు. శంకర్‌దయాళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. త్వరలో సినిమానీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.
దర్శకుడు శంకర్ దయాళ్ మాట్లాడుతూ, 'బాల్యదశలో ఉన్న ఓ పిల్లవాడు యవ్వనం వరకు సాగే ప్రయాణం ఎలా ఉంటుందో ఈ చిత్రంలోని కథానాయకుడు రాజకీయాల్లోకి ప్రవేశించే క్రమం ఆ విధంగా ఉంటుంది. రాజకీయంగా అతనిని కలిసే ప్రతివ్యక్తి మలుపుకి కారణమవుతాడు. ఎదుటివాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వం ఈ చిత్రంలోని హీరోది' అని చెప్పారు.
'శకుని అంటే దుష్ట ఆలోచనలే అనుకోవద్దు. ఓ సమస్య నుంచి తెలివిగా ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో శకుని స్వభావం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ప్రస్తుతం మధ్యవర్తులు లేకపోతే... ఏ పనీ జరగడం లేదు. లంచం ఇవ్వకపోతే ఫైలు కదలడం లేదు. ఈ వాతావరణంలో ఓ యువకుడు శకునిలా తన పనులను చక్కబెట్టుకొన్నాడు అనేదే 'శకుని'చిత్రం స్టోరీ లైన్.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, రాధిక, నాజర్, రోజా, సంతానం తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: ప్రేమ్‌రక్షిత్, బాబా భాస్కర్, సహ నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: ఎన్.శంకర్ దయాళ్.


Click it and Unblock the Notifications











