మనం పోలీస్‌ ఉద్యోగం చేయడం లేదు సర్, చెంచా ఉద్యోగం చేస్తున్నాం: కార్తీ "ఖాకీ"

కార్తీ "ధీరమ్ అధిగారమ్ ఒండ్రు" సినిమా ఇప్పుడు తెలుగులో ఖాకీ అనే పేరుతో వస్తోంది. థియేట్రికల్‌ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటం తో తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోగలమనే నమ్మకంతో ఉంది టీమ్...

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఛాన్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారుహీరోలు. అలాంటి పాత్ర వస్తే చాలు తమదైన స్టైల్లో ఆ పాత్రని కొత్తగా, రియలిస్టిక్ గా చేయాలన్న తపనతో ఉంటారు. అలాంటి పాత్రనే కార్తీకి 'ఖాకి' సినిమాలో లభించింది. వినోద్ దర్శకత్వంలో 'ధీరమ్ అధిగారమ్ ఒండ్రు' అనే సినిమాలో కార్తీ నటించాడు. ఇదే సినిమా ఇప్పుడు తెలుగులో ఖాకీ అనే పేరుతో వస్తోంది. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటం తో తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోగలమనే నమ్మకంతో ఉంది టీమ్...

చెంచా ఉద్యోగం చేస్తున్నాం

చెంచా ఉద్యోగం చేస్తున్నాం

"మనం చెడ్డవాళ్ల నుంచి మంచివాళ్లను కాపాడే పోలీస్‌ ఉద్యోగం చేయడం లేదు. మంచి వాళ్లనుంచి చెడ్డవాళ్లను కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం.. సార్‌'' అని ఓ పోలీసాఫీసర్‌ తన పైఅధికారిని అడుగుతున్న ప్రశ్న ఇది. ‘‘పవర్‌లో ఉన్నోడి ప్రాణానికిచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణాలకు ఎందుకివ్వరు సార్‌' ఇది అతని ఆవేదన. దీన్నిబట్టి అతనెంత సిన్సియర్‌గా డ్యూటీ చేయాలనుకుంటున్నాడో వేరే చెప్పనవసరం లేదు.

హాయిగా లంచం తీసుకొని

హాయిగా లంచం తీసుకొని

అంతేకాదు ‘‘ఎన్ని ట్రాన్స్‌ఫర్స్‌.. హాయిగా లంచం తీసుకొని ఒకచోట ఉండొచ్చు కదా..'' అని గర్ల్‌ఫ్రెండ్‌ అంటున్నా ఆమె అమాయకత్వానికి నవ్వుకుని ఉద్యోగం పట్ల బాధ్యతగా ఉంటాడు. అలాంటోడికి ఓ కేసు పెద్ద సవాల్‌లా నిలిచింది. ఈ కేసులోని దోషులకు ఎలాగైనా శిక్షపడేలా చేయాలనుకున్నాడు.

 తెలుగులో

తెలుగులో "ఖాకి"గా

ఆ ప్రయత్నం లో అతనికి డిపార్టెంట్‌మెంట్‌ నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించింది? కొందరు రాజకీయ నాయకులు దోషులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలను అతను ఎలా తిప్పికొట్టాడు? అన్న అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘ధీరమ్‌ అధిగారమ్‌ ఒండ్రు'. ఇదే చిత్రం తెలుగులో ‘ఖాకి'గా రాబోతుంది.

కార్తీ నటన సూపర్‌

కార్తీ నటన సూపర్‌

"ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. కార్తీ నటన సూపర్‌. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాను నవంబర్‌ 17న విడుదల చేయాలనుకుంటున్నాం. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ గ్లామర్‌ అండ్‌ యాక్టింగ్‌ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. దర్శకులు బాగా తెరకెక్కించారు.

నమ్మకం ఉంది

నమ్మకం ఉంది

తెలుగులో ‘రన్‌ రాజా రన్‌', ‘జిల్‌', ‘బాబు బంగారం', ‘హైపర్‌' తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది'' అని నిర్మాతలు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X