మంచు విష్ణు డబ్బులకు కక్కుర్తిపడే హీరో.. నాకేమైనా జరిగితే అతడే కారణం..

ఓటర్ సినిమా వివాదం హీరో మంచు విష్ణు, దర్శకుడు సాయి కార్తీక్‌రెడ్డి మధ్య చిచ్చు రాజేసింది. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాత, దర్శకుడికి మంచు విష్ణు స్నేహితుడు లీగల్ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో తనకు హీరో మంచు విష్ణు నుంచి బెదిరింపులు వస్తున్నాయని దర్శకుడు కార్తీక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్వయంగా ఆయన స్వయంగా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నది.

తాజా వీడియోలో కార్తీక్ రెడ్డి ఏం చెప్పారంటే.. ఓటర్ సినిమా కోసం అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లే, కథను కోటిన్నర ఇస్తానని ఒప్పుకున్నట్టు హీరో మంచు విష్ణు చెబుతున్న విషయంలో వాస్తవం లేదు. ఓటర్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేస్తే నాకు వచ్చింది రూ.20 లక్షలే అనే విషయాన్ని కార్తీక్ రెడ్డి వెల్లడించారు.

Karthik Reddy: I have life threat from Manchu Vishnu

బాహుబలి సినిమా రైట్స్ కోటి ఉండవు. అలాంటి ఓటరు సినిమాకు కోటిన్నర ఇస్తానని ఒప్పందం చేసుకొంటానా అని కార్తీక్ ప్రశ్నించారు. తాను నాకు మోసం చేశాడు కాబట్టే ఎదురు తిరిగాను. అతడికి ఎదురు తిరగడం తప్పు లేదు. సినిమా నిర్మాతకు నష్టం జరగకూడదు. సినిమా బయటకు రావాలనే ఉద్దేశంతో సంతకం చేశాను అని అన్నారు.

తనకు ఎదురు తిరిగాను కాబట్టి మంచు విష్ణు నన్ను ఏమైనా చేయవచ్చు. నాకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యత ఆయనే. సినిమా కోసం నేను చాలా త్యాగం చేశాను. నిర్మాతలకు మంచి జరుగాలని కోరుకొన్నాను. సినిమా రిలీజ్ కాకుండా నిర్మాతలను టార్చర్ గురిచేస్తున్నాడు. తన సినిమాను రిలీజ్ చేసుకోకుండా అడ్డుపడిన హీరోను ప్రపంచంలో చూడలేదు. డబ్బులకు కక్కుర్తి పడిన హీరో మంచు విష్ణు. ఆయన తీరును తప్పుపడుతున్నందుకు నన్ను ఏమైనా చేయవచ్చు. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే అందుకు బాధ్యుత మంచు విష్ణుదే అని కార్తీక్ రెడ్డి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X