RC15: రామ్ చరణ్ కోసం శంకర్ సాహసం: 30 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి అలా చేసిన డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలి టాలెంట్లతో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరీ ముఖ్యంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్న చరణ్.. ఇకపై వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండు చిత్రాలు విడుదల కాకముందే దిగ్గజ దర్శకుడు శంకర్‌తో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు. తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Recommended Video

RC 15 : చెర్రీ టార్గెట్ ప్యాన్ ఇండియా | Ram Charan Shankar Combo Feast For Fans
రెండు సినిమాలతో రెడీగా చరణ్

రెండు సినిమాలతో రెడీగా చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే దర్శఖధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రుధిరం రణం)లో ఎన్టీఆర్‌తో కలిసి నటించాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా చేస్తున్నారు. దీనితో పాటు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లోనూ చరణ్ కీలక పాత్రను చేశాడు.

లెజెండరీ డైరెక్టర్‌తో భారీ సినిమా

లెజెండరీ డైరెక్టర్‌తో భారీ సినిమా

RRR, ఆచార్య విడుదల కాకముందే రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి చాలా కాలం పాటు చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా అతడు.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. భారీ స్థాయిలో వచ్చే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ముందే శంకర్ అన్నీ రెడీ చేసేసి

ముందే శంకర్ అన్నీ రెడీ చేసేసి

శంకర్ సినిమా అంటే సుదీర్ఘమైన ప్రయాణం ఉంటుంది. అయితే, చరణ్‌తో చేసే సినిమా కోసం మాత్రం ఆయన అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారు. అలాగే, ప్రారంభానికి ముందే కాస్టింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఇలా ఇప్పటికే దీని కోసంజయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి వంటి వాళ్లను ఎంపిక చేశారు. అలాగే, థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని సెలెక్ట్ చేసుకున్నారు.

గ్రాండ్ లాంచ్.. వరుస షెడ్యూళ్లు

గ్రాండ్ లాంచ్.. వరుస షెడ్యూళ్లు

రామ్ చరణ్ - శంకర్ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఇది నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయింది. ఇక, ఈ చిత్రం ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ కోసం శంకర్ సాహసం

రామ్ చరణ్ కోసం శంకర్ సాహసం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా కోసం దర్శకుడు శంకర్ తన పంథాను మార్చుకుని మరీ ముందుకు వెళ్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసిన ఆయన.. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాదు, తొలిసారి వేరే వాళ్లు ఇచ్చిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది.

30 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి అలా

30 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి అలా

శంకర్ దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఒక్క ‘నన్బన్' మూవీ (త్రీ ఇడియట్స్ రీమేక్) తప్ప వేరే వాళ్ల కథలతో సినిమాలు చేయలేదు. కానీ, రామ్ చరణ్‌తో చేసే మూవీ కోసం మాత్రం కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలవబోతుందని చెప్పుకోవచ్చు.

స్వయంగా వెల్లడించిన డైరెక్టర్

స్వయంగా వెల్లడించిన డైరెక్టర్

ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి చాలా రోజులుగా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజ్.. ఈ మూవీ కథ తనదే అని వెల్లడించాడు. ‘శంకర్ - రామ్ చరణ్ గారి సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఈ లెజెండరీ డైరెక్టర్‌తో పని చేయాలన్న కోరిక ఇప్పటికి తీరింది' అంటూ కార్తీక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X