twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊర్వశి పాత్రలో ఎన్టీఆర్ హీరోయిన్

    By Srikanya
    |

    హైదరాబాద్: జూ.ఎన్టీఆర్ సరసన దమ్ములో చేసిన కార్తీక గుర్తుండే ఉంటుంది. ఆమె త్వరలో ఊర్వసిగా కనిపించి అలరించనుంది. ప్రముఖ చిత్రకారుడు రవి వర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఓ మళయాళ చిత్రం తెలుగులో రవి వర్మ పేరుతో డబ్ అవుతోంది.లెనిన్ రాజేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవివర్మ పాత్రను ప్రఖ్యాత చాయాగ్రహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ పోషించారు.

    కార్తీక ప్రధాన పాత్రలో చేసిన ఈ చిత్రం నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్న ఈ సినిమాను 'రవివర్మ' పేరుతో ఎస్వీఆర్ మీడియా శోభారాణి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రవివర్మ చిత్రాలు సజీవ దృశ్యాలుగా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయాయి.చిత్రకారుల్లో అగ్రగణ్యుడు రవివర్మ. ఆయన చిత్రాలు సజీవ దృశ్యాలుగా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయాయి. అంతటి మహోన్నత చిత్రకారుడి కథతో మలయాళంలో తెరకెక్కిన సినిమా 'మకరం మంజు'.

    ఆగస్ట్‌లో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను శోభారాణి తెలియజేస్తూ- ''రవివర్మ చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహావ్యక్తి కథతో తెరకెక్కిన సినిమాను మా సంస్థ ద్వారా విడుదల చేయడం గర్వంగా భావిస్తున్నాం. రవివర్మ జీవితంలో జరిగిన పలు సంఘటనలకు ఎంతో అందంగా తెరరూపాన్ని ఇచ్చారు లెనిన్ రాజేంద్ర. ఇందులో ఊర్వశి చిత్రాన్ని గీస్తూ, తనకు తాను పురూరవుడుగా ఊహించుకుంటాడు రవివర్మ. చిత్రమైన ఆ పరిస్థితే ఈ చిత్ర కథాంశం.

    ఈ సందర్భంలో వచ్చే ఊర్వశి పాత్రను కార్తీక పోషించారు. ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందీ పాత్ర. ఇక రవివర్మ పాత్రకు సంతోష్‌శివన్ ప్రాణం పోశారు. ఇంకా నిత్యామీనన్, లక్ష్మీశర్మ కూడా ఇందులో ప్రత్యేక పాత్రలు పోషించారు. మధు అంబట్ ఛాయాగ్రహణం, రమేష్ నారాయణ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. వచ్చేనెల ప్రథమార్థంలో పాటలను, అదే నెలలో సినిమాను విడుదల చేస్తాం. ఈ రొమాంటిక్ క్లాసికల్ మూవీ తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని మా నమ్మకం'' అన్నారు.

    English summary
    A film on Ravi Varma was brought in Malayalam titled ‘Makara Manju’ and the same is being dubbed into Telugu by SVR Media with a title ‘Ravi Varma’. Santosh Menon is playing the title role, while Karthika, Nithya Menon and Mallika Kapoor are the heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X