వివాహేతర సంబంధం.. వ్యక్తిపై కార్తీక దీపం నటుడి కాల్పుల కలకలం
కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆ సీరియల్ లో ప్రేమ్ పాత్ర అందరినీ ఆకట్టుకున్న సంగతిత తెలిసిందే. ఆ సీరియల్ ఫాలో ప్రతిఒక్కరికీ అతడు సుపరిచితుడే. అయితే అతడు రియల్ లైఫ్ లో వీరంగం సృష్టించాడు. ఓ వ్యక్తిపై పబ్లిక్‌గా కాల్పులు జరిపాడు. దీనికి వివాహేత సంబంధమే కారణమని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఏ బంధమైనా సరే.. నమ్మకం అనేది ఎంతో ముఖ్యం. ఆ నమ్మకమే కోల్పోతే.. ఇక ఆ బంధం నరకప్రాయమే అవుతుంది. ముఖ్యంగా భార్యభర్తల మధ్యలో ఈ నమ్మకం అనేది చాలా అవసరం. కానీ ఇప్పుడది కొరవడుతోంది. అందుకు కారణం అక్రమ సంబంధం. ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.

అనుబంధాల్లో అలజడులు: అందంగా సాగుతున్న భార్యభర్తల జీవితంలో ఉన్నట్లుండి ఈ వివాహేతర సంబంధం వంటి విషయాలు బయటపడటం కలకలం రేపుతున్నాయి. దాంపత్య సుఖాన్ని పాడు చేస్తున్నాయి. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. భాగస్వాములిద్దరిలో ఏ ఒక్కరి విషయంలో అయినా.. ఈ అక్రమ సంబంధం బయటపడిదంటే.. అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది. ఇందులో భాగంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం మాత్రమే కాదు.. చంపుకునేంత వరకు వెళ్లిపోతున్నారు.

సీరియల్ నటుడు కాల్పులు: తాజాగా కార్తీక దీపం సీరియల్ నటుడు.. వేరొకడి భార్యతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీనితో ఆగ్రహానికి గురైన ఆ నటుడు.. కాల్పులు జరిపాడు. ఈ కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ్ భార్యతో యాక్టర్ మనోజ్‌కు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగి ఉంటాయని కూడా భావిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే: శామీర్ పేట్ సెలబ్రిటీ క్లబ్ లో కాల్పుల కలకలం రేగింది. భార్యతో ఉన్న ప్రియుడిని ప్రశ్నించిన భర్తపై.. ప్రియుడు ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. భార్య వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించినందుకే కాల్పులు జరిపినట్లు సమాచారం. సెలబ్రిటీ క్లబ్ లో సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తి భార్యతో ఉన్న సీరియల్ ఆర్టిస్ట్ మనోజ్ ఉన్నాడు. క్లబ్ కు వెళ్లి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా సిద్ధార్థ్ పట్టుకున్నాడు.

ఎయిర్ గన్ తో కాల్పులు: దీనితో కోపోద్రిక్తుడైన మనోజ్... తన ఎయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరిపాడు. కాల్పుల నుంచి తప్పించుకున్న బాధితుడు ఘటనపై శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ విషయం బయటకు వచ్చింది. ఇక సిద్ధార్థ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సీరియల్ ఆర్టిస్టు మనోజ్ పై కేసు నమోదు చేశారు. ఈ కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. ఇక ఈ మనోజ్ కార్తీక దీపంలో ప్రేమ్ గా, మౌనపోరాటం సీరియల్ లో ద్వారక గా నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











