'కార్తిక' చాలా హాట్ గురూ
నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'జోష్'. ఒకప్పటి ప్రముఖ కథానాయిక రాధ కూతురు కార్తిక ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతోంది. వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెపెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ చౌతా సంగీతాన్ని అందించారు.
ఈ నేపథ్యంలో 'జోష్' రషెస్ ప్రదర్శిస్తున్నారట. ఈ రషెస్ చూసిన వారు కార్తిక గురించి ప్రత్యేకంగా చర్చించుకొంటున్నారట. కార్తిక చాలా హాట్ గా వుందని, గ్లామర్ పరంగానే కాకుండా నటనపరంగా బాగా చేసిందని కితాబిస్తున్నారట. తల్లికి తగ్గ తనయ అనిపించుకుందట. మరి ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
karthika josh naga chaitanya dil raju vasu varma sandeep chowta nagarjuna radha కార్తిక జోష్ నాగచైతన్య దిల్ రాజు వాసు వర్మ సందీప్ చౌతా నాగార్జున రాధ


Click it and Unblock the Notifications