ఎట్టకేలకు నాగ చైతన్య జోడీ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. అయితే ఆమె మరెవరో కాదు. ఒకప్పటి గ్లామర్ క్వీన్ రాధ కూదురు కార్తీక. దిల్ రాజు,వాసు వర్మ సెర్చింగ్ చేసి పట్టుకున్న ఈ టీనేజ్ అమ్మాయి ప్రస్తుతం ప్లస్ టు చదువుకుంటోందని సమాచారం. ఇక ఈమెకు సంభందించిన ఫొటో షూట్ ఈ మధ్యనే పూర్తి చేసారు. అది చూసిన వారంతా నాగ చైతన్యకు కరెక్టు జోడి అని ప్రశంసిస్తున్నారని చెప్తున్నారు. ఇక రాధ మొదట ఇష్టపడకపోయినా లాంచింగ్ ఆఫర్,నాగార్జున కుమారుడు అనేవి చూసి ఒప్పుకుంది. వీరి కాంబినేషన్ వచ్చే వారం నుండి హైదరాబాద్ లో జరగనుంది.