జూ ఎన్టీఆర్ ఎక్స్ ట్రీమ్లీ టాలెంటెడ్: టాప్ హీరోయిన్ డాటర్
నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్" చిత్రంతో నాయికగా తెరంగేట్రం చేసిన భామ కార్తీక. 'జోష్" ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో కొంత నిరాశపడ్డ ఈ ముద్దుగుమ్మకు జీవా నటించిన 'రంగం" విజయాన్ని అందించింది. ఈ చిత్రం అందించిన విజయంతో మంచి జోష్ మీదున్న కార్తీక తెలుగు, తమిళ, మళయాల భాషల్లో యమబిజీ అయిపోయింది.
తెలుగులో జూ ఎన్టీఆర్ తో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న'దమ్ము" చిత్రంలో త్రిషతో కలిసి రెండవ నాయికగా నటించే ఛాన్స్ కొట్టేసిన కార్తీక తమిళ క్రేజీ హీరో శింబుతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తోందట. ఇటీవల తనకు వస్తున్న అవకాశాల గురించి కార్తీక మాట్లాడుతూ 'రంగం" చిత్రం అందించిన విజయంతో తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు లభించింది.
ఆ చిత్రం అందించిన ఉత్సాహంతో వున్న నాకు మంచి చిత్రాల్లో నటించే అవకాశాలు లభిస్తున్నాయి. 'జోష్" చిత్రం తర్వాత తెలుగులో నేను నటిస్తున్న 'దమ్ము" నాకు మరింత గుర్తింపుని తెచ్చిపెడుతుంది. ఇందులో జూ ఎన్టీఆర్, త్రిషలతో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. జూ ఎన్టీర్ తో కలిసి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే జూ ఎన్టీఆర్ ని సెట్ లో చూస్తుంటే చాలా టాలెంటెడ్ పర్సన్ అని కితాబులిస్తోంది. తమిళంలో క్రేజీ హీరో శింబుతో నటించాలని వుంది. ఆ అవకాశం త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను" అని తెలిపింది కార్తీక.


Click it and Unblock the Notifications











