twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో..! అప్పుడేనా...! ఇంకొన్నాళ్ళుండొచ్చుగా... అంటారనుకుందా..?

    |

    అల‌నాటి అందాల తార రాధ పెద్ద కూతురు కార్తీక సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తోంద‌ట‌. న‌య‌న‌తారో స‌మంతానో సినిమాలు మానేస్తున్న‌ట్లుగా మీడియాలో ఈ వార్త‌తో హోరెత్తించేస్తున్నారు. వ్య‌వ‌హారం చూస్తుంటే ఇదేదో ప్రీప్లాన్డ్ ప్ర‌చారం లాగా క‌నిపిస్తోంది. హీరోయిన్ గా రాణిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ భామ , తెలుగులోనే కాదు తమిళం లోను సక్సెస్ కాలేకపోయింది..చేసిన రెండు , మూడు చిత్రాలు కూడా సక్సెస్ కాకపోవడం తో అమ్మడికి అవకాశాలు ఇచ్చే నాధుడు కరువయ్యాడు..దీంతో అమ్మడు బుల్లితెర పై సెటిల్ కావాలని డిసైడ్ అయ్యింది.

    తెలుగులో 'జోష్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది మాజీ హీరోయిన్ తనయ కార్తీక. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ తరువాత సినిమాలేవీ దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత తమిళ్ కు వెళ్లిన అక్కడ 'కో'(రంగం) తప్ప ఒక్క హిట్టు కూడా వేసుకోలేదు. ఈ మధ్యలో మళ్లీ ఎంటీఆర్ తో "దమ్ము" లో చేసినా ఫలితం లేదు.., సరే కొంత తగ్గించుకోని చిన్న సినిమా అయినా పర్లేదు అనుకొని అల్లరి నరేష్ 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' సినిమాలతో తెలుగులో స్థిరపడాలనుకున్నా ఆ ఆశ కూడా నెరవేరలేదు. ఇక ఇప్పుడు సీన్ అర్థమై పోవటంతో ఇక వెండితెరకు గుడ్‌బై చెప్పాలనుకుంటుందట.

    ఉదయ చంద్రిక

    ఉదయ చంద్రిక

    రాధగా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన ఉదయ చంద్రిక దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించింది. ఎనబైలలో గ్లామరస్ స్టార్ గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ రాధ. తమిళంలో శివాజీ గణేషన్ నుంచి అప్పటి యంగ్ హీరో కార్తీక్ వరకూ, తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించిన ఈమె ఖాతాలో ఎన్నో పెద్ద హిట్స్ ఉన్నాయి. 90 వ దశకం ప్రారంభానికే రాధా సినీ పరిశ్రమ నుంచి అంతర్థానం అయ్యింది.

    కూతురు కార్తీక

    కూతురు కార్తీక

    తన సినిమా కెరీర్ ముగించి పెళ్ళి చేసుకొని స్థిర పడ్డ రాధ ఆతరవాత కొన్నేళ్ళకి తన కూతురు కార్తీకని హీరోయిన్ గా నిలబెట్టాలని ప్రయత్నించింది. తనకున్న పరిచయాలతో అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య సరసన అతని తొలి సినిమా లోనే చాన్స్ దక్కించుకునేలా చేసింది.

    మొదటి చిత్రం

    మొదటి చిత్రం "జోష్"

    నాగ చైతన్య మొదటి చిత్రం "జోష్" తో వెండి తెర కు హీరోయిన్ గా పరిచయం అయిన కార్తీక ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ తరువాత సినిమాలేవీ దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత తమిళ్ కు వెళ్లిన అక్కడ ‘కో' (రంగం) లో చేసింది. ఆ సమయం లో అది9 పెద్ద హిట్ తెలుగులో కూదా మంచి విజయాన్నే అందుకుంది.

    సక్సెస్ కాలేకపోయింది

    సక్సెస్ కాలేకపోయింది

    అయితే ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం సాధించలేకపోయింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించినా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది.హీరోయిన్ గా రాణిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ భామ , తెలుగులోనే కాదు తమిళం లోను సక్సెస్ కాలేకపోయింది.

    కార్తీక

    కార్తీక

    ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించినా హీరోయిన్ గా స‌క్సెస్ కాలేక‌పోయింది. త‌మిళంలో హీరోయిన్ గా న‌టించిన రంగం మూవీ పెద్ద హిట్ సాధించింది. అయితే కార్తీక కెరీర్ ను స‌క్సెస ట్రాక్ ఎక్కించ‌లేక‌పోయింది.

    రంగం

    రంగం

    కెరీర్లో ప‌ది సినిమాల దాకా చేసిన కార్తీక అందులో కొట్టింది ఒకే ఒక హిట్టు. అదే "రంగం. అందులోనూ ఆమె ప్ర‌త్యేక‌త ఏమీ క‌నిపించ‌దు. ఆ పాత్ర‌లో ఇంకో హీరోయిన్ ఉంటే సినిమా మ‌రింత బాగా ఆడేదేమో అనిపిస్తుంది. అందం.. అభిన‌యం రెండింట్లోనూ కార్తీక పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోవ‌డం.. పైగా వ‌రుస‌గా ఆమె సినిమాలు ఫ్లాప‌వ‌డంతో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.

    నిమాలకు గుడ్‌ బై

    నిమాలకు గుడ్‌ బై

    తమిళంలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో కార్తీక సినిమాలకు గుడ్‌ బై చెప్పేసి బుల్లి తెరకు మాత్రమే పరిమితం కావాలనుకుంటోందట. అదీ హిందీ సీరియల్స్‌ లో మాత్రమే కనిపించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

    కాస్త ఓవర్ గా ఉంది

    కాస్త ఓవర్ గా ఉంది

    అయితే ఇక్కడ జోక్ ఏమిటంటే ఎవ‌రైనా హీరోయిన్ ఫ‌లానా సినిమా చేస్తోంద‌ని మీడియాకు స‌మాచారం ఇవ్వ‌డం మామూలే కానీ.. సినిమాలు మానేస్తున్న‌ట్లు ప్ర‌త్యేకంగా మీడియా సంస్థ‌ల‌కు స‌మాచారం ఇవ్వ‌డం వింతగా, కాస్త ఓవర్ గానూ ఉంది.

    తమిళ పత్రికలన్నిటిలో

    తమిళ పత్రికలన్నిటిలో

    న‌య‌న‌తారో స‌మంతానో సినిమాలు మానేస్తున్న‌ట్లుగా మీడియాలో ఈ వార్త‌తో హోరెత్తించేస్తున్నారు. వ్య‌వ‌హారం చూస్తుంటే ఇదేదో ప్రీప్లాన్డ్ ప్ర‌చారం లాగా క‌నిపిస్తోంది. ఏదో అంతర్జాతీయ నటి ఇక కనిపించదేమో అన్నంతగా అందరూ భాదపడిపోతారేమో అనిపించేటట్టు తమిళ పత్రికలన్నిటిలో ఈ న్యూస్ వేసేసారు.

    నో ప్రాబ్లమ్

    నో ప్రాబ్లమ్

    అయినా ఈమెకు అవకాశాలు కరువైనా నో ప్రాబ్లమ్ ఎందుకంటే ఇప్పటికే తన తండ్రికి సంబందించిన బిజినెస్‌లను హ్యాండిల్ చేస్తూ మంచి బిజినెస్ ఉమెన్‌గా పేరు తెచ్చుకుంది కార్తీక. మరి ఈ సీరియల్ విషయంలో కార్తీక నిర్ణయమేంటో కొద్దీ రోజుల్లోనే తేలనుంది.

    English summary
    Lack of success for actress Karthika has made her literally quit the movie business. If the latest reports are to be believed she will be moving to small screen to try her luck.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X