కృష్ణుడు ఏంటి.. కథను ఆయనే నడిపించటం ఏంటి! ఆసక్తి రేపుతున్న 'కార్తికేయ 2' ట్రైలర్
గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఎట్టకేలకు కి అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలుసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన తాజా చిత్రం నుంచి ఒక ట్రైలర్ విడుదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

హ్యాపీడేస్ తో ఎంట్రీ
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ''హ్యాపీడేస్' చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యాడు నిఖిల్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నిఖిల్. తర్వాత వరుస పరాజయాలు చవిచూశాడు. స్వామి రారా సినిమాతో ఆయన అతని కెరీర్ మరోసారి మలుపు తిరిగింది. కార్తికేయ, ఎక్కడికి పోతావ్ చిన్నవాడ, అర్జున్ సురవరం వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మొదటి ట్రైలర్
టాలెంటెడ్ డైరెక్టర్ చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇక మొదటి భాగంలో నిఖిల్ జతగా రీతూ వర్మ నటించగా ఈ రెండో భాగం సినిమాలో నిఖిల్‌కు జోడీగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. 'కార్తికేయ 2 నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా జులై 22న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజా సినిమా యూనిట్ మొదటి ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.

ఆసక్తి పెంచే విధంగా
హైదరాబాద్ నగరంలోని ఏఎంబీ సినిమాస్‌లో సినిమా యూనిట్ కార్తికేయ 2 మొదటి ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఒక నిమిషం 30 సెకండ్ల నిడివిగల ఈ వీడియో 'శాంతను.. ఇది నువ్ ఆపలేని యాగం, నేను సమిధను మాత్రమే, ఆజ్యం మళ్లీ అక్కడ మళ్లీ మొదలైంది' అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. 'అసలు కృష్ణుడు ఏంటి?.. ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి?', 'విశ్వం ఒక పూసల దండ, ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే' అనే డైలాగ్స్ సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా సాగుతున్నాయి.

ఉత్కంఠకు గురిచేసేలా
సముద్రంలోని ద్వారకా నగరం వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ట్రైలర్‌లో కొంత క్లారిటీ ఇచ్చేసింది సినిమా యూనిట్. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు. ఇక ట్రైలర్‌లోని ప్రతి షాట్ కూడా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా కట్ చేశారు. ఇక ఇప్పుడు విడుదల చేసింది మొదటి ట్రైలర్ కాగా రెండో ట్రైలర్ త్వరలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది

జూలై 22న
కార్తికేయ 2 సినిమాలో కార్తికేయగా నిఖిల్, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతను అనే పాత్రలో ఆదిత్య మీనన్ నటిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఎ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











