మోదీ, అమిత్ షా మెచ్చిన తెలుగు సినిమాకు జాతీయ అవార్డు.. సంబరాల్లో నిఖిల్, అభిషేక్ టీమ్
భారతీయ సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభను చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ సినీ అవార్డులతో సత్కరించింది. 70వ జాతీయ ఉత్తమ చలన చిత్ర పురస్కారాలు 2024 అవార్డులను గ్రాండ్‌గా ప్రకటించింది. ఈ అవార్డుల్లో భారతీయ సంస్కతిని ప్రతిబించేలా కృష్ణతత్వం నేపథ్యంగా రూపొందించిన కార్తీకేయ 2 చిత్రానికి అవార్డు దక్కింది. అయితే ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు రావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయారు. ఈ అవార్డు వెనుక ఉన్న కృషి గురించిన వివరాల్లోకి వెళితే..
ది కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన కార్తీకేయ 2 చిత్రం అన్ని వర్గాల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఉత్తరాదిలో కనకవర్షం కురిపించి రికార్డులు తిరగరాసింది.

ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు తన సన్నిహితుడు ఉద్దవకు ఇచ్చిన అపురూపమైన వస్తువు కలియుగంలో ఓ యువకుడికి ఎలాంటి సక్సెస్‌ను అందించి పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు. 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 117 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కార్తీకేయ 2 చిత్రాన్ని వ్యాపార, సామాజిక, సినీ రంగాలే కాకుండా రాజకీయ నేతల కూడా ప్రశంసలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్లు ఈ సినిమాపై ప్రశంసలు గుప్పించారు. భారతీయ విలువలు చాటి చెప్పిన నిర్మాత అభిషేక్ అగర్వాల్, నిఖిల్ సిద్దార్థను అభినందనలతో ముంచెత్తారు.
ఇక తాజాగా కార్తీకేయ 2 సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డును అందజేసింది. దాంతో ఈ సినిమాకు మరోసారి అరుదైన గుర్తింపు దక్కిందనే అభిప్రాయం సినీ, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈ అవార్డులను త్వరలోనే ఓ కార్యక్రమంలో విజేతలకు అందజేస్తారు.


Click it and Unblock the Notifications











