పాయల్‌ను లిప్‌లాక్‌కు ఎలా ఒప్పించామంటే?.. కొందరు మరీ నీచంగా.. కార్తీకేయ
RX 100 సినిమా స్క్రిప్టు చెప్పినప్పుడు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చక్కగా జడ్జ్ చేసింది. కొంత మంది హీరోయిన్లకు ఈ కథ చెప్పినప్పుడు ముద్దులు వద్దు.. లిప్ లాక్‌లు.. లాక్ అయితే ఒకే కానీ ఇంటెన్సివ్‌గా ఉండకూడదు. ఎన్ని ఉంటాయి అంటూ చాలా నీచంగా మాట్లాడారు.
కథలో ఉండే ఇంటన్సిటీని మాత్రమే పాయల్ పట్టించుకొన్నది. లిప్ లాక్ గురించి ఆలోచించలేదు. చాలా ప్రొఫెషనల్‌గా యాక్ట్ చేసింది. ఒక్కసారి సినిమా చూసిన తర్వాత హీరోయిన్ రోల్ ప్రాధాన్యత ఏంటో మీకే తెలుస్తుంది అని హీరో కార్తీకేయ అన్నారు.

అర్జున్‌రెడ్డి తర్వాత రిలీజ్‌కు ముందే మంచి హైప్ వచ్చిన చిత్రం RX 100. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత టాలీవుడ్‌లో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్, హీరో కార్తీకేయ రొమాన్స్, కెమిస్ట్రీ చర్చనీయాంశమైంది. ప్రముఖ దర్శకుడు ఆర్జీవి శిష్యుడు అజయ్ భూపతి రూపొందించిన ఆర్ ఎక్ష్ 100 చిత్రం జూలై 12న రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











